నవంబర్ 14న బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఫేస్‌లిఫ్ట్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ, ఈనెల 14న భారత మార్కెట్లో మరో కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేయనుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 డెట్రాయిట్ మోటార్ షోలో బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2014 జెడ్4 స్పోర్ట్స్ కారును నవంబర్ 14న దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఇదివరకటి బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 స్పోర్ట్స్ కారుతో పోల్చుకుంటే, కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొద్దిపాటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త జెడ్4 సరికొత్త రంగులలో లభ్యం కానుంది. ఈ కారులో బాహ్య మార్పుల విషయానికి వస్తే, కొత్త ఫ్రంట్ బంపర్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు సైడ్ ఇండికేటర్స్‌ను కొత్తగా రీడిజైన్ చేశారు.

ఇంటీరియర్స్‌లో కూడా మార్పులు చేర్పలు ఉన్నాయి. గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో కూడిన ఎయిర్ వెంట్స్, 'ఫైన్‌లైన్ ఆంథ్రాసిట్' ఉడ్ ఫినష్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ వంటి మార్పులతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్స్‌ను కూడా మెరుగుపరచారు. ఇందులో ప్రధానమైన మార్పుగా కన్వర్టబిల్ రూఫ్‌ను చెప్పుకోవచ్చు. ఇది పూర్తి బ్లాక్ కలర్‌లో ఉంటుంది.
ఇండియన్ వెర్షన్ 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 స్పోర్ట్స్ కారు విషయానికి వస్తే, జెడ్4 ఎస్‌డ్రైవ్ 35ఐ వేరియంట్ 3.0 లీటర్, ట్విన్ టర్బో, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఈ ఇంజన్ గరిష్టంగ 306 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

అయితే, గ్లోబల్ మార్కెట్లలో లభ్యం కానున్న 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీని ధర ఇతర వివరాలను నవంబర్ 14న వెల్లడించనున్నారు. ఆటోమొబైల్ ప్రపంచంలో అన్ని తాజా అప్‌డేట్‌ల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








