ఇసుజు ఎమ్‌యూ-7, డి-మ్యాక్స్‌లకు బుకింగ్స్ ప్రారంభం

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వటం గురించి ఇప్పటికే మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. తాజా అప్‌డేట్ ప్రకారం, ఇసుజు దేశీయ విపణిలో విడుదల చేయనున్న తొలి ఉత్పత్తి 'ఇసుజు ఎమ్‌యూ-7' ఎస్‌యూవీ కోసం కంపెనీ బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఇసుజు తమ ఎమ్‌యూ-7 ఎస్‌యూవీతో పాటుగా డి-మ్యాక్స్ అనే పికప్ ట్రక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అతి త్వరలోనే ఇది నగర రోడ్లపై పరుగులు తీయనుంది. దేశీయ విపణిలో ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ ధర రూ.24.16 లక్షలుగా ఉండగా, సింగిల్ క్యాబిన్ వెర్షన్ డి-మ్యాక్స్ పికప్ ధర రూ.6.78 లక్షలు గాను, డబుల్ క్యాబిన్ వెర్షన్ డి-మ్యాక్స్ పికప్ ధర రూ.8.09 లక్షలు గాను ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది.

ఇసుజు మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్న విషయం తెలిసినదే. ప్రారంభంలో భాగంగా, ఈ ప్లాంటు కోసం కంపెనీ రు.1,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఇసుజు మోటార్స్ ఏర్పాటు చేయనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌లో ఆరంభంలో భాగంగా, ఏటా 50,000 వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ 2015 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి దశకు చేరుకోవచ్చని అంచనా. అప్పటి వరకూ ఇసుజు మోటార్స్ తాత్కాలిక ప్రత్యమ్నాయంగా చెన్నైలోని తిరువళ్లూర్‌లో ఉన్న హిందుస్థాన్ మోటార్స్, జనరల్ మోటార్స్ కార్ ప్లాంట్‌లను ఉపయోగించుకోనుంది.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

More from DriveSpark

Article Published On: Tuesday, February 26, 2013, 13:11 [IST]
English summary
Japanese utility vehicle maker Isuzu Motors is all set to roll outs its first SUV MU-7 in India. According to reports the company is now taking bookings for this powerful SUV MU-7 and its versatile pick-up D-max. Isuzu Motors has firmed up its India plans with a manufacturing plant in Sri City, Andhra Pradesh. Isuzu will invest nearly Rs 1,000 crore in the greenfield plant that can make nearly 50,000 vehicles a year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+