బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి సెలెరియో బుకింగ్స్ ఓపెన్

By Ravi

మారుతి సుజుకి నుంచి రానున్న బెస్ట్ ఇన్ క్లాస్ స్మాల్ కార్ 'సెలెరియో' (Celerio) మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ సెలెరియో కోసం ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. నేటి (జనవరి 24, 2014) నుంచే సెలెరియో బుకింగ్‌లను ప్రారంభిస్తున్నామని కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో సమయంలో మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను వాణిజ్య పరంగా విడుదల చేయనున్నారు. సెలెరియోకు సంబంధించి కొన్ని వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. సుజుకి సెలెరియో మొత్తం 6 వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో నాలుగు మ్యాన్యువల్ వేరియంట్లు కాగా 2 ఆటో గేర్ షిఫ్ట్ వేరియంట్లు.

మారుతి సెలెరియోలో అధునాతన 998సీసీ కె-నెక్స్ట్ ఇంజన్ విత్ డ్రైవ్ బై వైర్ టెక్నాలజీని ఉపయోగించామని, ఫలితంగా ఇది లీటరుకు 23.1 కి.మీ. మైలేజినిస్తుందని కంపెనీ వెల్లడించింది. సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో రూపొందించిన సెలెరియోకు సంబందించి ముఖ్యమైన ఫీచర్లను వెల్లడిస్తూ మారుతి సుజుకి కొన్ని అఫీషియల్ వీడయోలను కూడా విడుదల చేసింది. వాటిని ఈ కథనంలో వీక్షిద్దాం రండి.

బుకింగ్స్

బుకింగ్స్

జనవరి 24, 2014వ తేది నుంచి అన్ని అధీకృత మారుతి సుజుకి డీలర్‌షిప్ కేంద్రాల్లో సెలెరియో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. సెలెరియో కారుకు సంబంధించిన వీడియోలను తర్వాతి స్లైడ్‌లలో వీక్షించండి.

ఈజీ స్టైల్ - వీడియో

* సీకో స్టయిలింగ్ (కర్వ్ ఇన్ కర్వ్ అవుట్)

* షార్ప్ హెడ్‌ల్యాంప్ డిజైన్

* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

* ఆకర్షనీయమైన బాడీ లైన్స్

* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్

ఈజీ స్పేస్ - వీడియో

* ఎక్స్‌ప్యాండ్ డిజైన్ (స్పేసియస్ హెడ్‌రూమ్, లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్)

* రూమీ క్యాబిన్

* డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్

* 15 స్మార్ట్ యుటిలిటీ స్టోరేజ్ స్పేసెస్

* 235 లీటర్స్ బూట్ స్పేస్

ఈజీ టెక్నాలజీ - వీడియో

* కె-నెక్స్ట్ ఇంజన్ విత్ డ్రైవ్ బై వైర్

* ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్సిమిషన్

* బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్

* మ్యాన్వువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్

ఈజీ గిజ్మోస్ - వీడియో

* బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్టీరియో సిస్టమ్

* స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

ఈజీ డ్రైవ్ - వీడియో

* ఇండియా ఫస్ట్ ఆటో గేర్ షిఫ్ట్ (ఫస్ట్ ఇన్ క్లాస్)

* 23.1 కెఎమ్‌పిఎల్ మైలేజ్

డ్రైవ్ ఈజీ - హోమ్

సుజుకి సెలెరియో కమర్షియల్ వీడియో

More from DriveSpark

Article Published On: Friday, January 24, 2014, 15:17 [IST]
English summary
Maruti Suzuki Celerio booking open from 24th Jan’14. The Celerio is available in 6 variants, 4 variants in Manual transmission and 2 variants in auto gear shift. Price of the Celerio will be announced at the time of the launch. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+