బుగాటి వేరాన్‌కు నివాళి: ఈ కారు గురించి ఆసక్తికరమైన 10 విషయాలు

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే బుగాటి వేరాన్ కథ కంచికి చేరిన సంగతి తెలిసినదే. బుగాటి ఈ మోడల్ ఉత్పత్తిని 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇందులో చిట్టచివరి బుగాటి వేరాన్‌ను కంపెనీ ఇటీవలే ఉత్పత్తి చేసి, జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది. ఇకపై వేరాన్ సూపర్‌కార్లు బుగాటి ఉత్పత్తి చేయబోదు.

బుగాటి తొలిసారిగా 2005లో తమ వేరాన్ కారును మార్కెట్‌కు పరిచయం చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మోడల్ మార్కెట్ నుంచి తొలగిపోయింది. ఈ పదేళ్ల కాలంలో బుగాటి వేరాన్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారుగా చెరగని రికార్డు నమోదు చేసింది. ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌కి మచ్చుతునకగా నిలిచిన ఈ సూపర్‌కారుకు సంబంధించిన 10 ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బుగాటి వేరాన్‌కు నివాళి: ఈ కారు గురించి ఆసక్తికరమైన 10 విషయాలు

తర్వాతి స్లైడ్‌లలో బుగాటి వేరాన్ కారుకి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

అత్యంత వేగంగా పరుగులు తీసే కార్

అత్యంత వేగంగా పరుగులు తీసే కార్

బుగాటి వేరాన్ కారులో లభిస్తున్న సూపర్ స్పోర్ట్ వేరియంట్ ఇప్పటికీ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారుగా రికార్డును కలిగి ఉంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 431.072 కిలోమీటర్లు (267.856 ఎమ్‌పిహెచ్). కాగా ఇదే మోడల్‌లో లభిస్తున్న గ్రాండ్ స్పోర్ట్ విటెస్స్ వేరియంట్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన రోడ్‌స్టర్ (ఓపెన్ టాప్) కారు. దీని గరిష్ట వేగం గంటకు 408.84 కిలోమీటర్లు (254.04 ఎమ్‌పిహెచ్).

ఆకలి, దాహం ఎక్కువ

ఆకలి, దాహం ఎక్కువ

బుగాటి వేరాన్‌కు ఇంధన దాహం ఎక్కువ. ఈ కారు ఇంధన ట్యాంక్ సామర్థ్యం 26.4 గ్యాలన్లు (100 లీటర్లు). ఈ కారును ఫుల్‌ట్యాంక్ చేయించి ఆపకుండా నడిపితే కేవలం 12 నిమిషాల్లోనే ఇంధనం ఖాలీ అవుతుంది. ఈ కారును గరిష్టంగా గంటకు 250 మైళ్ల వేగంతో నడిపితే టైర్లు కేవలం 15 నిమిషాల్లోనే అరిగిపోతాయి.

వెయ్యి గుర్రాల పవర్

వెయ్యి గుర్రాల పవర్

బుగాటి వేరాన్ కారులో అత్యంత శక్తివంతమైన 8.0 లీటర్, 64-వాల్వ్, డబ్ల్యూ16 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 4 టర్బోచార్జర్లు 1001 హార్స్‌పవర్‌ల శక్తిని, 1250 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.

మనిషి కన్నా ఎక్కువ గాలి పీల్చుతుంది

మనిషి కన్నా ఎక్కువ గాలి పీల్చుతుంది

బుగాటి వేరాన్ కార్లు గరిష్టంగా గంటకు 253 మైళ్ల వేగం వద్ద ప్రతి నిమిషానికి 47,000 లీటర్ల గాలిని గ్రహిస్తాయి. ఇది ఒక మనిషి సగటున నాలుగు రోజుల పాటు పీల్చే గాలితో సమానం.

రేడియేటర్స్

రేడియేటర్స్

బుగాటి వేరాన్ కోసం ఒక రేడియేటర్‌ను తయారు చేయటానికి 15 గంటల సమయం పడుతుంది. ప్రతి కారులో ఎయిర్-టూ-లిక్విడ్ ఇంటర్‌కూలర్స్ కోసం 10-3 హీట్ ఎక్సేంజర్లు, 3 ఇంజన్ రేడియేటర్లు, ఎయిర్ కండిషన్ సిస్టమ్ కోసం ఒకటి, ట్రాన్సిమిషన్ ఆయిల్ రేడియేటర్ ఒకటి, డిఫరెన్షియల్ ఆయిల్ రేడియేటర్ ఒకటి, ఇంజన్ ఆయిల్ రేడియేటర్ ఒకటి ఉంటాయి.

ఇంధన ప్రవాహం

ఇంధన ప్రవాహం

బుగాటి వేరాన్ కార్లలోని ఫ్యూయెల్ పంప్స్ సాధారణ కార్లతో పోల్చుకుంటే ఎనిమిది రెట్లు అధికంగా ఇంధనాన్ని ఇంజన్‌కు సరఫరా చేస్తాయి.

స్పెషల్ టైర్స్

స్పెషల్ టైర్స్

బుగాటి వేరాన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మిషెల్లిన్ పిఏఎక్స్ టైర్లను ఉపయోగిస్తారు. వెనుక వైపు ఉపయోగించిన టైర్లు 14.5 ఇంచ్‌ల వెడల్పును కలిగి ఉంటాయి, ఇవి రెగ్యులర్ కార్లతో పోల్చుకుంటే రెండింతలు వెడల్పుగా ఉంటాయి. ఒకవేళ రీప్లేస్‌మెంట్స్ అవసరమైతే కారును ఫ్రాన్స్‌కి షిప్ చేసి, కొత్త టైర్లను అమర్చుకోవాల్సి వస్తుంది. ఇందుకయ్యే ఖర్చు సుమారు 70,000 డాలర్లు.

హీట్ ప్రూఫ్ బ్రేక్స్

హీట్ ప్రూఫ్ బ్రేక్స్

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ఈ కారును నిలుపుదల చేయాలంటే సమర్థవంతమైన మరియు అధిక వేడిని తట్టుకునే బ్రేక్స్ ఉండాలి. ఇందులో ముందు వైపు 400 మి.మీ. వెనుక వైపు 380 మి.మీ కార్బన్ బ్రేక్స్ ఉంటాయి, ఇవి 1800 డిగ్రీల వరకూ వేడిని తట్టుకుంటాయి.

స్పాయిలర్ బ్రేక్

స్పాయిలర్ బ్రేక్

బుగాటి వేరాన్ గరిష్ట వేగంలో ఉన్నప్పుడు కారును పూర్తిగా నిలుపదల చేయటానికి కేవలం 10 సెకండ్ల సమయం మాత్రమే పడుతుంది. ఇందులోని బ్రేక్ ప్రెజర్ యాక్టివేటెడ్ స్పెషల్ స్పాయిలర్ కారణంగా, ఇది ఎయిర్ బ్రేక్‌గా పనిచేసి, కారు వేగాన్ని నియంత్రిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్‌కి భారీ నష్టం

ఫోక్స్‌వ్యాగన్‌కి భారీ నష్టం

ఫోక్స్‌వ్యాగన్ విక్రయించే ప్రతి వేరాన్ కారు పైనా సుమారు 6.25 మిలియన్ డాలర్లను నష్టపోతుంది. అయినప్పటికీ, ఈ కారు మాత్రం ఫోక్స్‌వ్యాగన్ చరిత్ర పుటల్లో ఓ చెరగని మరియు చిరగని పేజీగా మిగిలిపోతుంది.

Most Read Articles

English summary
The Bugatti Veyron story has come to an end, with the 450th and final unit sold to the last customer recently. Called the La Finale, the last Veyron was built after approximately ten years since the first model rolled off the production line in Molsheim, Alsace, in France.
Story first published: Friday, March 6, 2015, 16:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X