రెగ్యులర్ స్కార్పియోని బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోగా మార్చుకోండి!
మీ మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీని బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా మార్చుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ కథనం. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరియు ఇంగ్లాండ్‌కు చెందిన బిఏఈ సిస్టమ్స్‌ల కలయికతో ఏర్పడిన జాయింట్ వెంచర్ 'డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్' ఇప్పుడు రెగ్యులర్ స్కార్పియోను బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోగా మార్చేస్తోంది.
డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ ఇండియా హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉంది, ఇది మహీంద్రా డిఫెన్స్ వ్యాపారం యొక్క అధికారిక విభాగం. ఈ విభాగం ఇప్పటికే యాక్స్, రక్షక్, మార్క్స్‌మ్యాన్, ఆర్మోర్డ్ స్కార్పియో, బొలెరోలతో పాటుగా ర్యాపిడ్ ఇంటర్‌వెన్షన్ వెహికల్స్ వంటి సాయుధ వాహనాలను (సివిలియన్ అండ్ అఫీషియల్ ఉపయోగార్థం) ఆఫర్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో. సివిలియన్ వెర్షన్ మహీంద్రా స్కార్పియోను డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ మోడిఫై చేసి, బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చుతోంది. ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యమవుతాయి మరియు వీటిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ 'స్నాప్‌డీల్ డాట్‌కామ్' నుంచి రూ.75,000 అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ ద్వారా విక్రయించబడుతున్న ఈ బాడీ కిట్ 9ఎమ్ఎమ్ పిస్టల్స్, ఇతర చిన్న పేలుడు వస్తువులను తట్టుకుంటుంది.

ఈ కిట్‌లో భాగంగా, అన్నివైపులా ఆర్మోర్ ప్యానెల్స్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ఎక్స్‌ప్లోజన్ రెసిస్టెంట్ ఫ్యూయెల్ ట్యాంక్ విత్ ఫైర్ సప్రెసింగ్ మెటీరియెల్స్, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ డివైజ్ మరియు బుల్లెట్ ప్రూఫ్ మెటీరియెల్స్ కోసం ఇన్సూరెన్స్ కూడా లభిస్తాయి.

ఈ బుల్లెట్ ప్రూఫ్ కిట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు, ఇందులో సెక్యూరిటీ సిస్టమ్‌లను ఎలా ఉపయోగించాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో వాహనం లోనుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలను డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ ద్వారా వ్యక్తిగతంగా 2 గంటల శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.

రూ.75,000 కేవలం బుగింగ్ మొత్తం మాత్రమే. పూర్తి బుల్లెట్ ప్రూఫ్ బాడీ కిట్ మరియు ఎస్‌యూవీతో కలిపి దీని ధర రూ.12.66 లక్షలుగా ఉంటుంది.

ఈ ధరలో 2 ఏళ్ల వారంటీ, ఆర్మోర్ ఫిట్‌మెంట్ చార్జీలు మరియు అదనపు పన్నులు కలిసి ఉంటాయి. రెగ్యులర్ స్కార్పియోను కూడా డిఎల్ఎస్ అందించే బాడీ కిట్‌తో బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications








