రెనో కార్లపై డిస్కౌంట్స్; పెట్రోల్ వేరియంట్ ధరకే డీజిల్ వేరియంట్స్
సాధారణంగా పాత సంవత్సరం ముగియటానికి ముందుగా కార్ కంపెనీలు, అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు, స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా.. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ అన్ని మోడళ్లపై తగ్గింపులను, వివిధ ప్రోత్సాకాలను ఆఫర్ చేస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కేవలం పెట్రోల్ కార్ల ధరలకే డీజిల్ వెర్షన్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. రెనో ఇండియా విక్రయిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా సెడాన్లలో కొన్ని వేరియంట్లను పెట్రోల్ వేరియంట్ల ధరకే విక్రయిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని కంపెనీ పేర్కొంది. ఇవే కాకుండా, కంపెనీ అందిస్తున్న ఇతర మోడళ్లపై కూడా ప్రత్యేకమైన ఆఫర్లను రెనో అందిస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రెనో ఇండియా విక్రయిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా సెడాన్లలో కొన్ని వేరియంట్లను పెట్రోల్ వేరియంట్ల ధరకే విక్రయిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని కంపెనీ పేర్కొంది.

రెనో డస్టర్
* రూ.9.29 లక్షల ప్రత్యేక ధరకే రెనో డస్టర్ 85పిఎస్ ఆర్ఎక్స్ఎల్ డీజిల్ వేరియంట్
* రూ.11.29 లక్షల ప్రత్యేక ధరకే రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఆల్-వీల్ డ్రైవ్ (4X4)
* 2 ఏళ్ల అదనపు వారంటీ
* 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రెనో పల్స్
* రూ.5.19 లక్షల ప్రత్యేక ధరకే రెనో పల్స్ ఆర్ఎక్స్ఎల్ డీజిల్ వేరియంట్
* 2 ఏళ్ల అదనపు వారంటీ
* 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రెనో స్కాలా
* రూ.8.01 లక్షల ప్రత్యేక ధరకే రెనో స్కాలా ఆర్ఎక్స్ఎల్ డీజిల్ వేరియంట్
* 2 ఏళ్ల అదనపు వారంటీ
* 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రెనో ఫ్లూయెన్స్
* ప్రత్యేక కార్పోరేట్ బెనిఫిట్స్
* 2 ఏళ్ల అదనపు వారంటీ
* 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రెనో కొలియోస్
* 2 ఏళ్ల అదనపు వారంటీ
* 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్


Click it and Unblock the Notifications








