స్కొడా ర్యాపిడ్ ఆఫర్: 2014లో కొనండి.. 2016లో చెల్లించండి..
చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్‌పై ఇప్పటికే పలు విశిష్టమైన ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా ర్యాపిడ్ కోసం స్కొడా ఇండియా మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జిఓఎస్ఎఫ్) జరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ ర్యాపిడ్‌పై ఓ కొత్త ఫైనాన్స్ ఆఫర్‌ని ప్రకటించింది.
స్కొడా ర్యాపిడ్ కారును 2014లో కొనుగోలు చేయండి, ఈఎమ్ఐ మొత్తాన్ని 2016వ సంవత్సరం నుంచి చెల్లించండి అంటూ కంపెనీ ఆన్-లైన్ క్యాంపైన్ ప్రారంభించింది. ఈ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్లు రూ.1.87 లక్షల డౌన్‌పేమెంట్‌ను చెల్లించి ఈ డిసెంబర్ నెలలో స్కొడా ర్యాపిడ్‌ను కొనుగోలు చేస్తే 2015 సంవత్సరంలో (రూ.1 చెల్లిస్తే సరిపోతుంది) ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే, 2016వ సంవత్సరం ప్రారంభం నుంచి కస్టమర్లు నెలకు 17,563ల ఈఎఎమ్ఐని చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా, స్కొడా ర్యాపిడ్ కోసం కంపెనీ ఇతర ఫైనాన్స్ స్కీమ్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. ఒక సంవత్సరం ఈఎమ్ఐ చెల్లించకుండా కారును నడపాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
స్కొడా ర్యాపిడ్‌ను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న మొదటి 50 మంది కస్టమర్లు గార్మిన్ పోర్టబల్ నావిగేషన్ డివైజ్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరాను సొంతం చేసుకోవచ్చు. మరి ఆలస్యమెందుకు http://www.skoda-auto.co.in/ వెబ్‌సైట్‌ని సందర్శించి మీ ర్యాపిడ్‌ను వీలైనంత ర్యాపిడ్‌గా బుక్ చేసుకోండి. ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








