భారత్‌లో 14 కార్ కంపెనీలపై జరిమానా విధించిన సీసీఐ

By Ravi

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దేశీయ కార్ మేకర్లపై కొరడా జులుపించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించినందుు గాను , భారతదేశంలో కార్లను తయారు చేసే 14 కంపెనీలపై రూ. 2,544.65 కోట్ల జరిమానా విధించింది. విడిభాగాలు, విక్రయానంతర సేవలకు సంబంధించి వ్యాపార నిబంధనలను ఉల్లంఘించినందున జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ పేర్కొంది.

జరిమానా విధించబడిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్, మారుతీ సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి అగ్రగామి సంస్థలతో పాటుగా, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో సీసీఐ, టాటా మోటార్స్‌పై ఏకంగా రూ. 1,346.46 కోట్ల జరిమానా విధించగా, మారుతి సుజుకిపై రూ. 471.14 కోట్ల జరిమానాను విధించింది.

కంపెనీల వారీగా జరిమానా వివరాలు ఇలా ఉన్నాయి.
1. టాటా మోటార్స్ - రూ.1,346.46 కోట్లు
2. మారుతి సుజుకి - రూ.471.14 కోట్లు
3. మహీంద్రా అండ్ మహీంద్రా - రూ.292.25 కోట్లు
4. టొయోటా కిర్లోస్కర్ - రూ.93.38 కోట్లు
5. జనరల్ మోటార్స్ - రూ.84.58 కోట్లు
6. హోండా కార్స్ ఇండియా - రూ.78.47 కోట్లు
7. స్కోడా ఆటో - రూ.46.39 కోట్లు
8. ఫోర్డ్ ఇండియా - రూ.39.78 కోట్లు
9. ఫియట్ ఇండియా - రూ.29.98 కోట్లు
10. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా - రూ.20.41 కోట్లు
11. మెర్సిడెస్ బెంజ్ ఇండియా - రూ.23.08 కోట్లు
12. హిందుస్తాన్ మోటార్స్ - రూ.13.85 కోట్లు
13. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా - రూ.3.25 కోట్లు
14. నిస్సాన్ మోటార్ ఇండియా - రూ.1.63 కోట్లు

CCI Fines 14 Car Manufacturers

భారతదేశంలో కార్లు తయారు/అసెంబ్లింగ్ చేసే ఈ 14 కంపెనీలపై సీసీఐ మొత్తంగా రూ. 2,544.64 కోట్ల జరిమానా విధిస్తూ 215 పేజీలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. విడిగా ఒక్కో సంస్థపైనా విధించిన జరిమానాకు సంబంధించి సీసీఐ వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా కంపెనీల సగటు టర్నోవర్‌పై 2 శాతం మొత్తాన్ని జరిమానాగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని సీసీఐ ఆదేశించింది.

అసలేం జరిగింది? ఎందుకు జరిమానా?
దేశంలోని పలు కార్ల కంపెనీలు బహిరంగ మార్కెట్లోకి (నాన్-ఆథరైజ్డ్ అవుట్‌లెట్స్) తమ వాహనాలకు సంబంధించిన విడిభాగాలు సరఫరా చేయకపోవడంతో, సదరు వాహన యజమానులు విడిభాగాలను కార్ల కంపెనీ వర్క్‌షాప్ నుంచి కానీ లేదా షోరూమ్‌కు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా, బహిరంగ మార్కెట్లో కార్ల విడిభాగాల కొరత ఏర్పడుతోంది.

మరోవైపు, ఈ స్పేర్ పార్ట్‌లను వర్క్‌షాప్ లేదా షోరూమ్ నుంచి కొనుగోలు చేయాలంటే, కస్టమర్లు ఎక్కువ ధర వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, వీటి లభ్యత కూడా అంత విరివిగా ఉండదు. నాన్ ఆథరైజ్డ్ అవుట్‌లెట్స్‌లో విడిభాగాలను విక్రయిస్తే తమ ఆదాయం దెబ్బతింటుందంటూ కార్ల కంపెనీల డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కారణంగా కూడా ఇవి బహిరంగ మార్కెట్లోకు సరఫరా కావటం లేదు.

ఈ విషయంలో సీసీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత, పైన పేర్కొన్న 14 కంపెనీలు ఈ నిబంధనను ఉల్లంఘించాయని, ప్రాంతీయ ఒరిజినల్ విడిభాగాల సరఫరాదారుల (ఓఈఎస్‌ఎస్)తో పాటు, అధీకృత డీలర్లతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా ఆయా కంపెనీలు ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాయని సీసీఐ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 27, 2014, 13:03 [IST]
English summary
The Competition Commission Of India (CCI) has fined 14 car manufacturers a hefty fine of INR 2,544.65 crore for violating the competition law.
Read in English: Car Makers Fined
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+