కార్ ఆఫ్ ది ఇయర్ 2015 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' ఫీచర్లు
హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన 'హ్యుందాయ్ ఎలైట్ ఐ20' (Hyundai Elite i20) ఇటీవలే ప్రతిష్టాత్మక 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2015' (ICOTY)ను గెలుచుకున్న సంగతి తెలిసినదే. కేవలం రూ.4.89 లక్షల ప్రారంభ ధరకే హ్యుందాయ్ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 8 వేరియంట్లలో లభ్యమవుతోంది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు. దీని ఇంజన్ ఆప్షన్స్, ధరలు, మైలేజ్, ఫీచర్లు తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

ఫ్రంట్ ప్రొఫైల్
స్టయిలిష్ వ్రాప్ అరౌండ్ హెడ్‌ల్యాంప్స్, హెక్సాగనల్ ఫ్రంట్ ఎయిర్ డ్యామ్, షార్ప్ హుడ్ క్యారెక్టర్ లైన్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి.

సైడ్ ప్రొఫైల్
అలాగే సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే.. టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, బ్లాక్ ఫినిష్‌తో కూడిన సి పిల్లర్, ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వైస్ట్‌లైన్ మౌల్డింగ్స్, ఫ్లోటింగ్ బాడీ లైన్స్‌తో ఈ కారు చాలా అందంగా కనిపిస్తుంది.

రియర్ ప్రొఫైల్
ఎలైట్ ఐ20 ముందు వైపు నుంచే కాదు వెనుక వైపు నుంచి కూడా అందంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి వెనుక వైపు ఉన్న కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ (సగం బూట్ డోరుపై, సగం బాడీపై ఉండే ల్యాంప్) ఎల్ఈడి స్టయిల్‌లో ఉంటుంది. అలాగే డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, రియర్ రూఫ్ మౌంటెడ్ యాంటీనా, హై-మౌంట్ బ్రేక్ ల్యాంప్‌తో కూడిన స్పాయిలర్‌లు కారుకి మరింత అందాన్ని తెచ్చిపెడుతాయి.

ఇంటీరియర్స్
బీజ్ అండ్ బ్లాక్ డ్యూయెల్ టోన్ థీమ్డ్ ఇంటీరియర్స్, 1-జిబి ఇన్-బిల్ట్ మెమరీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, క్లస్టర్ ఐయోనైజర్‌తో కూడిన ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రియర్ 60:40 స్ప్లిట్ సీట్, 285 లీటర్ల బూట్ స్పేస్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, గ్లవ్ బాక్స్ కూలింగ్, లగేజ్ ల్యాంప్, కప్ హోల్డర్స్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్, హైట్ అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు దీని సొంతం.

సేఫ్టీ ఫీచర్లు
ఫ్రండ్ డ్రైవర్ అండ్ కోప్యాసింజర్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఫాలోమి హెడ్‌ల్యాంప్స్ (కారు లాక్ చేసిన తర్వాత కూడా కొంత సమయం పాటు వెలుగుతూ ఉండే లైట్స్), రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, రియర్ డిఫాగ్గర్, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, యాంటీ పించ్ పవర్ విండోస్ (డ్రైవర్ సైడ్ విండోకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే, అద్దం ఆటోమేటిక్‌గా క్రిందికి వచ్చేస్తుంది), స్మార్ట్ పెడల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ (చీకటి పడగానే ఆన్ కావటం, వెలుగు రాగానే ఆఫ్ కావటం) వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

కన్వీనెన్స్ ఫీచర్లు
అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేటివ్ సూపర్‌విజన్ క్లస్టర్ (బహుళ సమాచారాన్ని అందించే ఇన్ఫోటైన్‌మెంట్), మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ అడాప్టివ్ పార్కింగ్ గైడ్‌లైన్స్ డిస్‌ప్లే, రియర్ ఏసి వెంట్స్, రియర్ పార్సిల్ ట్రే, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఆటో ఫోల్డబిల్ ఎలక్ట్రిక్ మిర్రర్, సన్‌గ్లాసెస్ హోల్డర్, మ్యాప్ పాకెట్స్, యూఎస్‌బి, ఆక్-ఇన్ పోర్ట్, డోర్ ఆర్మ్‌రెస్ట్స్, వన్ టచ్ సిగ్నల్ సిస్టమ్, రియర్ వైపర్ అండ్ వాషర్, టికెట్ హోల్డర్ వంటి కంఫర్ట్ ఫీచర్లు దీని సొంతం.

పెట్రోల్ ఇంజన్
పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 11.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

డీజిల్ ఇంజన్
డీజిల్ వెర్షన్ ఎలైట్ ఐ20లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 22.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

మైలేజ్
పెట్రోల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 18.60 కెఎమ్‌పిఎల్
పెట్రోల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 18.24 కెఎమ్‌పిఎల్
డీజిల్ వెర్షన్ ఎరా, మాగ్నా వేరియంట్స్ - 22.54 కెఎమ్‌పిఎల్
డీజిల్ వెర్షన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ (ఆప్షనల్), ఆస్టా వేరియంట్స్ - 21.76 కెఎమ్‌పిఎల్


Click it and Unblock the Notifications








