షాకింగ్: సెలెరియో బ్రేక్ ఫెయిల్ సమస్య; 4 దేశాల్లో సేల్స్ బంద్!
మారుతి సుజుకి భారత మార్కెట్లో విడుదల చేసిన సెలెరియో కారును కేవలం దేశీయ విపణిలోనే కాకుండా యూకె, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తుంది. కాగా.. ఈ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న సెలెరియో కారులో బ్రేక్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తడంతో, ఆయా దేశాల్లో వీటి అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని సుజుకి ఓ ప్రకటనలో పేర్కొంది.
యూకేకి చెందిన ఓ ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్ సుజుకి సెలెరియో కారును టెస్ట్ చేస్తున్నప్పుడు, ఎమెర్జన్సీ బ్రేక్ వేయగా, బ్రేక్ ఫెయిల్ అయినట్లు తేలింది. దీంతో కంపెనీ ప్రకటనను విడుదల చేసింది. యూకె, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో అమ్మడవుతున్న రైట్ హ్యాండ్ డ్రైవ్ యూకె వెర్షన్ సెలెలియో మోడల్‌ను ఫిబ్రవరి 1 నుంచే అమ్మడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే సెలెరియో కారును కొనుగోలు చేసిన కస్టమర్లు ఎవరైనా ఉంటే, తక్షణమే ఈ కారును డ్రైవ్ చేయటం నిలిపివేయాలని కూడా కంపెనీ పేర్కొంది. బ్రేక్ పెడల్ సమస్యకు సంబంధించి కంపెనీ రీకాల్‌ను కూడా ప్రకటించింది. సుజుకి తమ డీలర్ నెట్‌వర్క్ ద్వారా కస్టమర్లను నేరుగా సంప్రదించి, సేఫ్టీ చెక్స్ చేసే వరకూ ఆయా కస్టమర్లకు ప్రత్యామ్నాయంగా మరో వాహనాన్ని అందించనుంది.
కాగా.. ఇండియా, థాయ్‌లాండ్ మార్కెట్లలో సెలెరియో 2014 ఆరంభం నుంచే అమ్మకంలో ఉంది. ఇప్పటి వరకూ ఇందులో ఎలాంటి సమస్య తలెత్తలేదు.


Click it and Unblock the Notifications








