ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం
ఈ ఫొటోలను చూసి ఇదెక్కడో విదేశాల్లో దృశ్యమని భ్రమ పడిపోకండి.. ఎందుకంటే ఇది మన దేశంలోనిదే. ఇంత చక్కటి వరల్డ్ క్లాస్ రహదారి ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..? ఇది మన దేశ వాణిజ్య రాజధానిగా చెప్పుకునే ముంబైలో ఉంది. ఈ లింక్ రోడ్డును ఇటీవలే ప్రారంభించారు.
ఈ రోడ్డుపై ఓ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా ఉంది. అంతేకాదు ఇది మనదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావటం విశేషం. ఈ రోడ్డును ముంబైలోని చెంబూర్ నుంచి శాంటాక్రూజ్ వరకు నిర్మించారు. గడచిన వారంలోనే ఈ రోడ్డును ప్రయాణికుల కోసం ఓపెన్ చేశారు.
భారతదేశపు మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ లింక్ రోడ్డును నిర్మించడానికి సుమారు రూ.450 కోట్లను ఖర్చు చేశారు. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే మరియు పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా మరింత వేగంగా ప్రయాణించేందుకు ఈ లింక్ రోడ్డు సహకరిసతుంది.

ఈ లింక్ రోడ్డు మొత్తం పొడవు 1.8 కిలోమీటర్లు. ఈ రోడ్డుపై నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ హార్బర్, సెట్రల్ రైల్వే ట్రాక్‌ల మీదుగా పోతుంది. ఈ ఫ్లైఓవర్‌ను ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, తిలక్ నగర్, అమర్ మహల్, కుర్లా వెస్ట్ అలాగే ఈస్ట్‌ల నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ లింక్ రోడ్డు ఓపెనింగ్ గురించి పెద్దగా ప్రచారం జరగట్లేదు. అంతేకాదు, ముంబైలో చాలా మందికి ఈ లింక్ రోడ్డు ఓపెన్ అయిన సంగతి కూడా తెలియదు. ఈ రోడ్డుపై ఘట్కోపర్ నుంచి కుర్లా వెస్ట్ వెళ్లటానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

ఈ లింక్ రోడ్డు ప్రాజెక్ట్ 2006లో ప్రారంభమైంది. ఇది పూర్తి కావటానికి మొత్తం 8 ఏళ్ల సమయం పట్టింది. డబుల్ డెక్కర్ ఫ్లైఓర్‌ని నిర్మించడానికి అనుమతులు రావటంలో జాప్యం కారణంగా, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి కారణం అని చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ వలన దాదాపు 3000 లకు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరందరినీ వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. ఇలంటి కారణాల వలన ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరగటమే కాకుండా, దీనిని వ్యయం కూడా భారీగా పెరిగింది. గతంలో ఈ ప్రాజెక్టును కేవలం రూ.115 కోట్లకే పూర్తి చేయాలనుకున్నారు. అది కాస్తా రూ.450 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications








