ఆటో ఎక్స్‌పో 2014: షెవర్లే ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ఇండియా ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత్‌కు పరిచయం చేసింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో షెవర్లే ఆడ్రా అనే ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఆవిష్కరించింది.
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు (పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువ కలిగినవి) గిరాకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు షెవర్లే తమ ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది.
షెవర్లే ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను మరియు ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీనిచ్చేలా షెవర్లే తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఆడ్రా'ను తీర్చిదిద్దింది.

జనరల్ మోటార్స్ నుంచి పాపులర్ అయిన స్మాల్ కార్ ప్లాట్‌ఫామ్ 'గమ్మా 2'ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త షెవర్లే కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసింది.

జనరల్ మోటార్స్ తమ గమ్మా2 ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే షెవర్లే బీట్, ఏవియో, ట్రాక్స్ వంటి మోడళ్లను తయారు చేస్తోంది.

జనరల్ మోటార్స్ ఆవిష్కరించి షెవర్లే ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 77 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇదే ఇంజన్‌ను షెవర్లే సెయిల్ సెడాన్ మరియు షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలలో ఉపయోగిస్తున్నారు.

షెవర్లే ఆడ్రా ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే, ఇది ఉత్పత్తి ధశకు చేరుకునేందుకు మరో ఏడాది సమయం పట్టే ఆస్కారం ఉంది.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో షెవర్లే ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆవిష్కరణ.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో షెవర్లే ఆడ్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆవిష్కరణ.


Click it and Unblock the Notifications








