ఆటో ఎక్స్‌పో 2014: షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా అందిస్తున్న బుజ్జి కారు షెవర్లే బీట్‌లో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను నేడు (ఫిబ్రవరి 5, 2014)న భారత మార్కెట్లో విడుదల చేసింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌‌పోలో జనరల్ మోటార్స్ ఈ కొత్త బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టింది.

పాత షెవర్లే బీట్‌తో పోల్చుకుంటే కొత్త 2014 షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్‌ ఫ్రంట్ డిజైన్‌లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, కొత్త బంపర్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు. ఇంటీరియర్స్‌లో కూడా అనేక మార్పులు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ షెవర్లే బీట్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లలో వీక్షించండి.

జనరల్ మోటార్స్ దాదాపు నాలుగేళ్ల క్రితం షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. కాగా.. కొత్త బీట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంజన్లనే కొత్త 2014 బీట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్‌పిజి వేరియంట్ కూడా యధావిధిగా కొనసాగనుంది.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

షెవర్లే బీట్ పెట్రోల్ వెర్షన్ ధరలు

Chevrolet Beat 1.2 MY 14- 4.06 Lakhs

Chevrolet Beat 1.2 LS MY 14 Y 14- 4.33 Lakhs

Chevrolet Beat 1.2 LT MY 14- 4.74 Lakhs

Chevrolet Beat 1.2 MY 14 with option pack- 5.26 Lakhs

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ షెవర్లే బీట్ ఎల్‌పిజి వెర్షన్ ధరలు

Chevrolet Beat 1.2 LS LPG MY14- 4.59 Lakhs

Chevrolet Beat 1.2 LT LPG MY 14- 5.05 Lakhs

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ వెర్షన్ ధరలు

Chevrolet Beat Diesel 1.0 TDCi MY 14- 4.89 Lakhs

Chevrolet Beat Diesel 1.0 LS TDCi MY 14- 5.17 Lakhs

Chevrolet Beat Diesel 1.0 LT TDCi MY 14- 5.60 Lakhs

Chevrolet Beat Diesel 1.0 LT TDCi MY 14 with optional pack- 6.10 Lakhs

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన జనరల్ మోటార్స్.

షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన జనరల్ మోటార్స్.

More from DriveSpark

Article Published On: Wednesday, February 5, 2014, 17:05 [IST]
English summary
GM India has revealed the new Chevrolet Beat facelift at the 2014 Auto Expo in Greater Noida today. Take a look at the exclusive photos.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+