టాటా బోల్ట్ కాదు.. షెవర్లే బోల్ట్.. 322 కి.మీ. మైలేజ్!
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్, డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 ఆటో షోలో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు పేరు 'షెవర్లే బోల్ట్' (Chevrolet Bolt). ఆకర్షనీయమైన డిజైన్‌తో చూపరులను ఆకట్టుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ కారులో సింగిల్ చార్జ్‌పై 200 మైళ్లకు పైగా (సుమారు 322 కిలోమీటర్లు) దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
షెవర్లే బోల్ట్ కారును 30,000 డాలర్లు (సుమారు రూ.18.7 లక్షలు) ధరకు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. మరో ఏడాది లేదా రెండేళ్ల కాలంలో ఇది మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ రేంజ్‌లో మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ ఎస్ మాత్రమే. అయితే, దీని ధర మాత్రం 30,000 డాలర్ల కన్నా అధికంగానే ఉంది.
జనరల్ మోటార్స్ తయారు చేసిన ఈ షెవర్లే బోల్ట్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసకుందాం రండి.

షెవర్లే తమ బోల్ట్ ఎలక్ట్రిక్ కారును అమెరికాలోని అన్ని 50 రాష్ట్రాలలోను మరియు అనేక అంతర్జాతీయ మార్కెట్లలోను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న షెవర్లే స్పార్క్ (మన మార్కెట్లో బీట్) ఎలక్ట్రిక్ కారు మాత్రం కేవలం కాలిఫోర్నియా, ఓరెగాన్ మార్కెట్లలో మాత్రమే అమ్ముడుపోతోంది.

షెవర్లే బోల్ట్ 200 మైళ్ల రేంజ్ వెనుక ప్లగ్-ఇన్ సోనిక్ ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, వాస్తవానికి దీనిని పూర్తిగా ప్రత్యేక డిజైన్‌పై తయారు చేశారు.

అల్యూమినియం, మెగ్నీషియం మరియు కార్బన్ ఫైబర్ వంటి తేలికపాటి పదార్థాలను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ కారును చేశారు. అందుకే ఇది తేలిక బరువును కలిగి ఉండి, ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

షెవర్లే బోల్ట్ పూర్తి గ్లాస్ రూఫ్‌ని కలిగి ఉండి, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ని కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది.

షెవర్లే బోల్ట్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ఇంటీరియర్స్ పూర్తిగా ఫ్యూచరిస్టింగ్ లుక్‌ని కలిగి ఉంటాయి.

షెవర్లే బోల్ట్ ఎలక్ట్రిక్ కారును ఉపయోగించే వారు తమ స్మార్ట్ ఫోన్‌ను బోల్ట్ ఈవి కనెక్ట్ యాప్ సాయంతో కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ద్వారా కార్ షేరింగ్‌ను కోఆర్డినేట్ చేసుకోవటం చేయవచ్చు. వాలెట్ ఫీచర్‌ను ఎంగేజ్ చేయటం ద్వారా ఈ కారు దానంతట అదే పార్క్ చేసుకోవటం, నిర్ధిష్ట సమయాన్ని సెట్ చేసిన తర్వాత పికప్ కోసం తిరిగి డ్రైవర్ వద్దకు రావటం జరుగుతుంది.

షెవర్లే బోల్ట్ కారులో మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, విభిన్న డ్రైవర్ల ఎంపిక మేరకు యాక్సిలరేటర్ మ్యాపింగ్, రైడ్ హైట్, సస్పెన్షన్ ట్యూనింగ్ వంటివి మారుతూ ఉంటాయి.

ఇందులో డిసి ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్ సాయంతో ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలను అతి తక్కువ సమయంలో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








