షెవర్లే కస్టమర్ల కోసం కంప్లీట్ కార్ కేర్ ప్రోగ్రామ్ ప్రారంభం
షెవర్లే బ్రాండ్ ఉత్పత్తుల మెయింటినెన్స్ అధికంగా ఉంటుందని, డీలర్‌షిప్ స్థాయిలో కస్టమర్ సపోర్ట్ బలహీనంగా ఉంటుందని కొందరు కొనుగోలుదారులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో, కస్టమర్లకు తమ సేవల సత్తా ఏంటో చూపించేందుకు జనరల్ మోటార్స్ భారత్‌లో 'షెవర్లే కంప్లీట్ కార్ కేర్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులు మెరుగైన అమ్మకపు తర్వాతి సేవల (ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్)ను అందించడం ద్వారా ప్రస్తుత వినియోగదారులను సంతృప్తి పరచడంతో పాటు భావివినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో జనరల్ మోటార్స్ ఈ షెవర్లే కంప్లీట్ కార్ కేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

షెవర్లే కంప్లీట్ కార్ కేర్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. షెవర్లే ప్రామిస్, ఎక్స్‌క్లూజివ్ వారంటీ ప్యాకేజ్‌లు, షెవర్లే యూ-ఫస్ట్ ప్రోగ్రామ్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్స్ వంటి పలు సౌకర్యాలను తమ వినియోగదారులకు కల్పించనున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

షెవర్లే ప్రామిస్:
ఇందులో భాగంగా, కారు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్‌తో కమిట్ అయ్యే పీరియాడిక్ మెయింటినెన్స్ ఖర్చు విషయంలో 3 ఏళ్లు లేదా 45,000 కిలోమీటర్లు పూర్తయిన తర్వాత (ఏది ముందు గడిస్తే అది) మిగిలిన పీరియాడిక్ అండ్ షెడ్యూల్డ్ మెయింటినెన్స్ ఖర్చును కస్టమర్లకు రిటర్న్ చేయటం జరుగుతుంది.

ఎక్స్‌క్లూజివ్ వారంటీ ప్యాకేజీలు:
స్టాండర్డ్ వారంటీ 1,00,000 కి.మీ. లేదా 3 ఏళ్లు (ఏది ముందు గడిస్తే అది). కావాలనుకుంటే, షెవర్లే వినియోగదారులు నామమాత్రపు ఖర్చుతో 1,50,000 కి.మీ. లేదా 2 ఏళ్ల (ఏది ముందు గడిస్తే అది) అదనపు వారంటీని పొందవచ్చు. స్పేర్ పార్ట్‌లు, యాక్ససరీలపై కూడా వారంటీని 20,000 కి.మీ. లేదా 1 ఏడాది (ఏది ముందు గడిస్తే అది) పాటు ఆఫర్ చేస్తారు.

షెవర్లే యూ ఫస్ట్ (మహిళా కస్టమర్ల కోసం):
మహిళల పేరుతో రిజిస్టర్ కాబడే షెవర్లే వాహనాల సర్వీస్ విషయంలో, షెవర్లే అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఉచిత పికక్, డ్రాప్ సౌకర్యాన్ని కల్పిస్తారు.

రోడ్‌సైడ్ అసిస్టెన్స్:
కొత్తగా షెవర్లే కారును కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచితంగా 3 ఏళ్ల పాటు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు అందిస్తారు. నామమాత్రపు ఫీజును చెల్లించడం ద్వారా ప్రస్తుత షెవర్లే కస్టమర్లు కూడా ఈ సేవలను ఆశ్రయించవచ్చు (అయితే వాహనం 5 ఏళ్ల కన్నా ఎక్కువ పాతది అయి ఉండకూడదు). ఈ సేవల్లో భాగంగా, వెహికల్ టోయింగ్, ఫ్లాట్ టైర్ చేంజ్, పరిమిత ఉచిత ఇంధనంతో అవుట్ ఆఫ్ ఫ్యూయెల్ అసిస్టెన్స్, కీ లాకవుట్, బ్యాటరీ జంప్ స్టార్ట్, టాక్సీ బెనిఫిట్ ప్రయోజనాలుంటాయి.

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్:
షెవర్లే కస్టమర్లు తమ వాహన సర్వీస్ ఖర్చును లెక్కించుకునేందుకు షెవర్లే సర్వీస్ ఎస్టిమేటర్ (Chevrolet Service Estimator) అనే అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అలాగే మైషెవర్లే ఇండియా (MyChevrolet India) అనే అప్లికేషన్ సాయంతో తమకు సమీపంలోని షెవర్లే సర్వీస్ స్టేషన్‌ను తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








