షెవర్లే ఎంజాయ్ వార్షికోత్సవ ఎడిషన్; త్వరలో విడుదల
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, దేశీయ విపణిలో షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని విడుదల చేసి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జనరల్ మోటార్స్ సరిగ్గా మే 9, 2013వ తేదీన తమ షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో కంపెనీ ఈ మోడల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, ఇది మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైంది.
ఈ నేపథ్యంలో, మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టడం ద్వారానైనా, ఈ మోడల్ అమ్మకాలు పెంచుకోవాలని జనరల్ మోటార్స్ యోచిస్తున్నట్లుంది. ఇందులో భాగంగానే, జనరల్ మోటార్స్ మరికొద్ది రోజుల్లో ఓ వార్షికోత్సవ ఎడిషన్ షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని ప్రవేశపెట్టనుంది. రెగ్యులర్ వెర్షన్ ఎంజాయ్‌తో పోల్చుకుంటే, మరిన్ని కొత్త ఫీచర్లను కంపెనీ తమ వార్షికోత్సవ ఎడిషన్ ఎంజాయ్‌లో ఆఫర్ చేయనుంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

గడచిన సంవత్సరం మే 2013 నెలలో విడుదలైన షవెర్లే ఎంజాయ్ ఇప్పటి వరకు 20,000 యూనిట్లకు పైగా అమ్మడుపోయింది. గతంలో కంపెనీ విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే ఎంజాయ్ మాదిరిగానే, త్వరలో కంపెనీ విడుదల చేయనున్న వార్షికోత్సవ షెవర్లే ఎంజాయ్ కూడా స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటుగా స్పెషల్ ఫీచర్లతో లభ్యం కానుంది. ఆ స్పెషల్ ఫీచర్లేంటో తర్వాతి స్లైడ్‌లో పరిశీలించండి.

రూఫ్ రెయిల్స్
కొత్త షెవర్లే ఎంజాయ్ వార్షికోత్సవ ఎడిషన్‌లో సరికొత్త రూఫ్ రెయిల్స్‌ను ఆఫర్ చేయనున్నారు. బ్లాక్ అండ్ సిల్వర్‌తో కూడిన ఈ రూఫ్ రెయిల్స్‌కు ఎంజాయ్‌కు మరింత స్పోర్టీ అండ్ స్టయిలిష్ లుక్‌నిస్తాయి.

కొత్త క్రోమ్ కిట్
షెవర్లే ఎంజాయ్ వార్షికోత్సవ ఎడిషన్‌కు క్రోమ్ కిట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ హెడ్‌ల్యాంప్స్, రియర్ టెయిల్ ల్యాంప్స్ మరియు రియర్ లైసెన్స్ ప్లేట్ పై భాగంలో క్రోమ్ టచ్ ఇచ్చారు. ఈ క్రోమ్ కిట్ వలన ఎంజాయ్ మరింత ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

కొత్త సైడ్ మిర్రర్స్
షెవర్లే ఎంజాయ్ వార్షికోత్సవ ఎడిషన్‌లో సైడ్ బ్లింకర్స్‌తో కూడిన సైడ్ మిర్రర్స్ (అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్)ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి రాత్రివేళ్లలో అధనపు సేఫ్టీని ఆఫర్ చేయటమే కాకుండా, మంచి స్టన్నింగ్ లుక్‌నిస్తాయి.

ఉడెన్ స్టైల్ డ్యాష్‌బోర్డ్ ఫినిష్
ఇక చివరిగా షెవర్లే ఎంజాయ్ వార్షికోత్సవ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో కొత్తగా డ్యాష్‌బోర్డ్ మధ్య భాగంలో అలాగే చివర్లలో మరియు డోర్ ట్రిమ్స్‌పై ఉడెన్ ఫినిష్ టచ్ ఇచ్చారు. ఇది కారులో లగ్జరీ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇంజన్ ఆప్షన్స్
లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే ఎంజాయ్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 13.25 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 13.8 కి.మీ. మైలేజీనిస్తుంది.
అలాగే, డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1.3 లీటర్ ఇంజన్ గరిష్టంగా 76 బిహెచ్‌పిల శక్తిని, 19.17 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ లీటరుకు 18.2 కి.మీ మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








