చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి విడుదల: వేరియంట్లు, ధరలు
భారత ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) సెగ్మెంట్లోకి ధరల యుద్ధానికి తెర లేపుతూ అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తమ సరికొత్త 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివిని నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. సెగ్మెంట్లో కెల్లా అత్యంత పోటీ ధరతో, మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి కన్నా తక్కువ ధరకే చెవర్లే ఎంజాయ్ మార్కెట్లో విడుదలయ్యింది.
దేశీయ విపణిలో చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి ప్రారంభ ధరను రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న మారుతి ఎర్టిగా ఎమ్‌పివి ప్రారంభ ధర రూ.5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. (రెండు ధరలు పెట్రోల్ వెర్షన్ బేస్ వేరియంట్లవి).

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ చెవర్లే ఎంజాయ్ ధరలు:
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 8 సీటర్ - రూ.5.49 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 7 సీటర్ - రూ.5.54 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టి 7 సీటర్ - రూ.6.31 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టిజెడ్ 7 సీటర్ - రూ.6.99 లక్షలు
డీజిల్ వెర్షన్ చెవర్లే ఎంజాయ్ ధరలు:
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 8 సీటర్ - రూ.6.69 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్ఎస్ 7 సీటర్ - రూ.6.75 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టి 7 సీటర్ - రూ.7.42 లక్షలు
- చెవర్లే ఎంజాయ్ ఎల్‌టిజెడ్ 7 సీటర్ - రూ.7.99 లక్షలు


Click it and Unblock the Notifications








