సరికొత్త ఫీచర్లతో షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలో కంపెనీ ఇప్పుడు ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. రెగ్యులర్ వెర్షన్ ఎంజాయ్‌తో పోల్చుకుంటే, మరిన్ని కొత్త ఫీచర్లను కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎంజాయ్‌లో ఆఫర్ చేస్తోంది.

షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్ ఎమ్‌పివి ప్రారంభ ధర రూ.5.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. షెవర్లే ఎంజాయ్ కొనుగోలుపై కంపెనీ రూ.33,000 విలువైన ప్రయోజనాలను మరియు రూ.14,000 విలువైన యాక్ససరీలను ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్‌లో యాంత్రికపరమైన మార్పులు లేవు. ఇది సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో పాటు పలు విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌

స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌

షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్ స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటుగా స్పెషల్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ స్పెషల్ ఫీచర్లేంటో తర్వాతి స్లైడ్‌లో పరిశీలించండి.

రూఫ్ రెయిల్స్

రూఫ్ రెయిల్స్

కొత్త షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్‌లో సరికొత్త రూఫ్ రెయిల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ సిల్వర్‌తో కూడిన ఈ రూఫ్ రెయిల్స్‌కు ఎంజాయ్‌కు మరింత స్పోర్టీ అండ్ స్టయిలిష్ లుక్‌‌నిస్తాయి.

కొత్త క్రోమ్ కిట్

కొత్త క్రోమ్ కిట్

షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్‌కు క్రోమ్ కిట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ హెడ్‌ల్యాంప్స్, రియర్ టెయిల్ ల్యాంప్స్ మరియు రియర్ లైసెన్స్ ప్లేట్ పై భాగంలో క్రోమ్ టచ్ ఇచ్చారు. ఈ క్రోమ్ కిట్ వలన ఎంజాయ్ మరింత ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

కొత్త సైడ్ మిర్రర్స్

కొత్త సైడ్ మిర్రర్స్

షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్‌లో సైడ్ బ్లింకర్స్‌తో కూడిన సైడ్ మిర్రర్స్ (అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్)ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి రాత్రివేళ్లలో అధనపు సేఫ్టీని ఆఫర్ చేయటమే కాకుండా, మంచి స్టన్నింగ్ లుక్‌నిస్తాయి.

ఉడెన్ స్టైల్ డ్యాష్‌బోర్డ్ ఫినిష్

ఉడెన్ స్టైల్ డ్యాష్‌బోర్డ్ ఫినిష్

ఇక చివరిగా షెవర్లే ఎంజాయ్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో కొత్తగా డ్యాష్‌బోర్డ్ మధ్య భాగంలో అలాగే చివర్లలో మరియు డోర్ ట్రిమ్స్‌పై ఉడెన్ ఫినిష్ టచ్ ఇచ్చారు. ఇది కారులో లగ్జరీ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ ఆప్షన్స్

లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే ఎంజాయ్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 13.25 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 13.8 కి.మీ. మైలేజీనిస్తుంది.

అలాగే, డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1.3 లీటర్ ఇంజన్‌ గరిష్టంగా 76 బిహెచ్‌పిల శక్తిని, 19.17 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ లీటరుకు 18.2 కి.మీ మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 24, 2014, 11:20 [IST]
English summary
The Limited Edition Chevrolet Enjoy is packed with luxurious new features that make it stand out from all the other cars. The car’s new wood dashboard trim makes the car look irresistibly stylish and the new chrome kit is bound to make heads turn. Its new OSRVM Side Blinkers ensure extra protection for the car and makes it look stunning at night.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+