చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి విడుదల తేది ఖరారు
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన 'ఎర్టిగా' ఎమిపివిని సవాల్ చేస్తూ జనరల్ మోటార్స్ నుంచి ఓ సరికొత్త ఎమ్‌పివి 'చెవర్లే ఎంజాయ్' ఈనెల 9న మార్కెట్లోకి రానున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఇదే విషయాన్ని జనరల్ మోటార్స్ అధికారికంగా ధృవీకరించింది.
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని మే 9, 2013న మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. జనరల్ మోటార్స్ ఇండియా తమ చెవర్లే ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఎంజాయ్ ఎమ్‌పివి ఫొటోలను, కొన్ని ఫీచర్లను వెల్లడి చేసింది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో కంపెనీ ఈ ఎమ్‌పివిని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర మరియు ఇతర సాంకేతిక వివరాలను తెలుసుకోవాలంటే మే 9 వరకూ ఆగాల్సిందే.
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లో టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, నిస్సాన్ ఇవాలియా వంటి ఎమ్‌పివిలకు పోటీగా నిలువనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 127 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది.
అలాగే, డీజిల్ వెర్షన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి. తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి



Click it and Unblock the Notifications








