హైదరాబాద్ మార్కెట్లో చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి విడుదల

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లోని ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) సెగ్మెంట్లోకి గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తాజాగా దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివి ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. జనరల్‌ మోటార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, ఆఫ్టర్‌ సేల్స్‌) రాజేష్‌ సింగ్‌ ఈ కొత్త ఎమ్‌పివి హైదరాబాద్‌లో విడుదల చేశారు. చెవర్లే ఎంజాయ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

రాష్ట్ర మార్కెట్లోకి చెవర్లే ఎంజాయ్ పెట్రోల్ వెర్షన్‌ ధరలు రూ.5.59 లక్షల నుంచి రూ.7.12 లక్షల రేంజ్‌లో ఉండగా, డీజిల్ వెర్షన్‌ ధరలు రూ.6.81 లక్షల నుంచి రూ.8.14 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో నిర్ణయించినట్లు రాజేష్ సింగ్ వివరించారు. ఇది వినియోగదారుల ఎంపికను బట్టి 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 13.25 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1.3 లీటర్ ఇంజన్‌ గరిష్టంగా 76 బిహెచ్‌పిల శక్తిని, 19.17 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ లీటరుకు 18.2 కి.మీ మైలేజీని. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 13.8 కి.మీ. మైలేజీనిస్తుంది.

Chevrolet Enjoy MPV

More from DriveSpark

Article Published On: Tuesday, May 14, 2013, 11:14 [IST]
English summary
Chevrolet Enjoy MPV has been launched in Hyderabad. The Maruti Ertiga competitor will be available for a starting price of INR 5.49 for the Enjoy LS 8 1.4 liter petrol variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+