21,000 మార్కును తాకిన షెవర్లే ఎంజాయ్ అమ్మకాలు

By Ravi

అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, దేశీయ విపణిలో షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని విడుదల చేసి ఏడాది పూర్తయిపోయింది. జనరల్ మోటార్స్ గడచిన సంవత్సరం మే 9వ తేదీన తమ షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కంపెనీ సుమారు 21,000 యూనిట్లను విక్రయించింది.

షెవర్లే ఎంజాయ్ భారత మార్కెట్లో విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో, కంపెనీ మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని కూడా విడుదల చేసింది. జనరల్ మోటార్స్ తమ ఎంజాయ్ ఎమ్‌పివి ఓ సక్సెస్‌ఫుల్ మోడల్ అవి భావిస్తోంది. అందుకే, కంపెనీ ఈ విజయాన్ని ఇయర్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్‌గా పిలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఇది పోటీ మోడల్‌గా ఉంటోదని కంపెనీ పేర్కొంది.

Chevrolet Enjoy

షెవర్లే ఎంజాయ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 13.25 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 13.8 కి.మీ. మైలేజీనిస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1.3 లీటర్ ఇంజన్‌ గరిష్టంగా 76 బిహెచ్‌పిల శక్తిని, 19.17 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ లీటరుకు 18.2 కి.మీ మైలేజీనిస్తుంది.

దేశీయ విపణిలో షెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి ధరలు రూ.5.74 లక్షల నుంచి రూ.8.13 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Thursday, June 19, 2014, 10:32 [IST]
English summary
The American parent company of Chevrolet had taken a decision to launch the Enjoy MPV in May, 2013. Chevrolet reported selling close to 20,000 MPV's in its maiden year. Now after a year they have managed to almost reach the 21,000 mark, they sold roughly 934 more vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+