షెవర్లే సెయిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల; వివరాలు

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని తమ షెవర్లే సెయిల్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఇది కంపెనీకి ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, షెవర్లే సెయిల్ అమ్మకాలు కాస్తంత ఊతమిచ్చేందుకు జనరల్ మోటార్స్ ఇందులో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

రెగ్యులర్ షెవర్లే సెయిల్‌తో పోల్చుకుంటే ఈ షెవర్లే సెయిల్ లిమిటెడ్ ఎడిషన్‌లో కంపెనీ మరిన్ని అదనపు ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ విపణిలో ఈ లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే సెయిల్ సెడాన్ ప్రారంభ దర రూ.5.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో అదనపు ఫీచర్లు మినహా డిజైన్ పరంగా కానీ లేదా యాంత్రికపరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు.

Chevrolet Sail Limited Edition

షెవర్లే సెయిల్ లిమిటెడ్ ఎడిషన్‌లో లభ్యమయ్యే ఫీచర్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
* కారు వెనుక వైపు లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్
* కారు సైడ్స్‌పై స్పెషల్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్
* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్
* కారు వెనుక వైపు క్రోమ్ గార్నిష్
* రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
* సెయిల్ బ్యాడ్జింగ్ కలిగిన ఇల్యుమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్స్
* డ్యూయెల్ టోన్ లిమిటెడ్ ఎడిషన్ సీట్ కవర్స్ అండ్ కుషన్ పిల్లోస్

ఈ అదనపు ఎక్విప్‌మెంట్లు, యాక్ససరీల విలువ రూ.45,000 వరకు ఉంటుందని షెవర్లే పేర్కొంది. షెవర్లే సెయిల్ పెట్రోల్ ఇంజన్ (1.2 లీటర్) మరియు డీజిల్ ఇంజన్ (1.3 లీటర్) ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 18.2 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటరుకు 22.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2014, 15:31 [IST]
English summary
Since GM India has failed to make any mark in the highly competitive compact sedan segment with the Chevrolet Sail the automaker has now announced a limited edition version of the vehicle to make it a more attractive buy for potential customers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+