షెవర్లే సెయిల్ యువా లిమిటెడ్ ఎడిషన్ విడుదల
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న షెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్ షెవర్లే సెయిల్ యువాతో పోల్చుకుంటే ఈ షెవర్లే సెయిల్ లిమిటెడ్ ఎడిషన్‌లో కంపెనీ మరిన్ని అదనపు ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.
దేశీయ విపణిలో ఈ లిమిటెడ్ ఎడిషన్ షెవర్లే సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ దర రూ.4.4 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో అదనపు ఫీచర్లు మినహా డిజైన్ పరంగా కానీ లేదా యాంత్రికపరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు.

షెవర్లే సెయిల్ యువా లిమిటెడ్ ఎడిషన్‌లో లభ్యమయ్యే ఫీచర్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
* కారు వెనుక వైపు లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్
* కారు సైడ్స్‌పై స్టయిలిష్ లమిటెడ్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్
* లిమిటెడ్ ఎడిషన్ సీట్ కవర్స్
* లిమిటెడ్ ఎడిషన్ కుషన్ పిల్లోస్
* సెయిల్ బ్యాడ్జింగ్ కలిగిన ఇల్యుమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్స్
* కారు వెనుక వైపు క్రోమ్ గార్నిష్
* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్
* రూఫ్ రెయిల్స్
షెవర్లే సెయిల్ యువా లిమిటెడ్ ఎడిషన్ రూ.28,000 విలువైన బెనిఫిట్లను మరియు రూ.14,300 విలువైన యాక్ససరీలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా.. షెవర్లే సెయిల్ యువాలో యాంత్రికపరమైన మార్పులు లేవు. ఇది పెట్రోల్ ఇంజన్ (1.2 లీటర్) మరియు డీజిల్ ఇంజన్ (1.3 లీటర్) ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 18.2 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటరుకు 22.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








