షెవర్లే ఇండియా నుంచి స్పిన్ ఎమ్‌పివి, ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటున్న షెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ ఈ ఏడాదే దేశీయ విపణిలో విడుదల కానుంది.

షెవర్లే ట్రైల్‌బ్లేజర్ తర్వాత రానున్న రెండవ ఉత్పత్తి షెవర్లే స్పిన్ ఎమ్‌పివి. జనరల్ మోటార్స్ ఫిబ్రవరి 13న బ్యాంకాక్‌లో నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించింది. 2015లో ట్రైల్‌బ్లేజర్‌ను, 2016లో స్పిన్ మోడల్‌ను విడుదల చేస్తామని తెలియజేసింది.

Chevrolet Trailblazer

షెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ 2.5 లీటర్ 2.8 లీటర్ డ్యురామ్యాక్స్ డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులోని 2.5 లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 350 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగా, 2.8 లీటర్ ఇంజన్ 180 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 480 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

షెవర్లే ట్రైల్‌బ్లేజర్ టూ-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభ్యం కానుంది. అయితే, ట్రైల్‌బ్లేజర్ రాకతో అంతంత మాత్రంగా అమ్ముడుపోతున్న కాప్టివా మోడల్ అమ్మకాలను కంపెనీ నిలిపివేస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

షెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఓ ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ. ధరను అందుబాటులో ఉంచేందుకు సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డైన్) రూట్లో దీనిని ఇండియాకు దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేసే ఆస్కారం ఉంది. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఎండీవర్, హ్యుందాయ్ శాంటాఫే, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

Chevrolet Spin

ఇకపోతే.. షెవర్లే స్పిన్ ఎమ్‌పివి విషయానికి వస్తే.. ఇదొక 7-సీటర్ ఎమ్‌పివి. ఇది ఈ సగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, హోండా మొబిలియో, త్వరలో రానున్న రెనో లాజీ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. హోండా మొబిలియో ఆర్ఎస్ (స్పోర్టీ వెర్షన్) మాదిరిగా షెవర్లే స్పిన్‌లో కూడా ఓ స్పోర్టీ వెర్షన్ (స్పిన్ యాక్టివ్) అందుబాటులో ఉంది.

షెవర్లే స్పిన్ ఎమ్‌పివిని జిఎమ్ గమ్మా 2 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, February 16, 2015, 18:49 [IST]
English summary
US auto major General Motors has announced that it will introduce the Chevrolet Trailblazer SUV in 2015 and Chevrolet Spin MPV in 2016 in India. The news was originally shared with GM India dealers during their annual meeting in Bangkok on February 13.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+