2014 టాటా సఫారీ స్టోర్మ్ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది..

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 17, 2012వ తేదీ టాటా మోటార్స్ తమ సరికొత్త సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మోడల్‌లో ఎలాంటి అప్‌గ్రేడెడ్ వెర్షన్ కూడా అందుబాటులోకి రాలేదు.

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో, ఇందులో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేయాలని టాటా మోటార్స్ భావిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త 2014 టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ దీపావళి పండుగకు ముందే విడుదల కావచ్చని తెలుస్తోంది.

2014 Tata Safari Storme Facelift

కొత్త 2014 టాటా సఫారీ స్టోర్మ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అనేక మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. అంతేకాదు, ఇందులో యాంత్రికపరంగా కూడా మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుత సఫారీ స్టోర్మ్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్ కన్నా మరింత స్పోర్టీయర్ ఇంజన్‌ను కొత్త సఫారీ స్టోర్మ్‌లో ఉపయోగించనున్నారు.

టాటా మోటార్స్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ టాటా ఆరియాలో ఉపయోగిస్తున్న 2.2 లీటర్ వేరికార్ ఇంజన్‌ను రీట్యూన్ చేసి పవర్‌ను 140 బిహచ్‌పిల నుంచి 150 బిహెచ్‌పిలకు పెంచే అవకాశం ఉంది. ఇంకా ఇందులో హార్మన్ కార్డన్ నుంచి గ్రహించిన టచ్‌స్క్రీన్ నావిగేషన్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2014, 14:42 [IST]
English summary
Tata Motors is gearing for the launch Safari Storme facelift. The new Safari Storme will have many changes on the outside as well as the inside. The major noticeable changes would the reworked engine which will help the new Storme to be sportier than its predecessor.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+