సన్‌రూఫ్ కలిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ వస్తోంది
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' త్వరలోనే సన్‌రూఫ్ ఫీచర్‌తో లభ్యం కానుంది. ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను ఫోర్డ్ ఇండియా తమ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో కూడా పరిచయం చేయనుంది.
సన్‌రూఫ్ కలిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది (క్రింది చిత్రంలో చూడొచ్చు). ఫోర్డ్ ఈకోస్పోర్ట్ భారత మార్కెట్లో విడుదలై దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో కంపెనీ ఈ సరికొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసే ఆస్కారం ఉంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సన్‌రూఫ్ వేరియంట్ గురించి కంపెనీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఆటో ఎక్స్‌పోలో ఈ వేరియంట్‌ను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే, త్వరలోనే ఇది మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సన్‌రూఫ్ వేరియంట్లో సన్‌రూఫ్‌తో పాటుగా 17-ఇంచ్ రిమ్స్ అండ్ బ్లాక్డ్ అవుట్ అల్లాయ్ వీల్స్ తప్ప ఇతర కాస్మోటిక్ మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సన్‌రూఫ్ వేరియంట్ కేవలం టాప్-ఎండ్ వేరియంట్లో (ఈకోబూస్ట్) మాత్రమే లభ్యం కావచ్చని సమాచారం.

రెగ్యులర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌తో పోల్చుకుంటే, సన్‌రూఫ్ కలిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర సుమారు రూ.50,000 నుంచి రూ.60,000లు అధికంగా ఉండొచ్చని అంచనా.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సన్‌రూఫ్ వేరియంట్ మార్కెట్లోకి వస్తే, ఈ సెగ్మెంట్లో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభ్యం కానున్న ఏకైక కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ మోడల్ మరో రికార్డు సృష్టించనుంది.


Click it and Unblock the Notifications








