మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల ఖరారు

By Ravi

గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి, తాజాగా స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్ ఇప్పటికే ఉత్పత్తి దశలో ఉంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్విఫ్ట్ డిజైర్ స్టాక్ ఖాలీ కాగానే, కొత్త స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

మా డ్రైవ్‌స్పార్క్ ప్రతినిధి స్థానిక మారుతి సుజుకి అధీకృత డీలరును సంప్రదించగా.. మరో నెల రోజుల వ్యవధిలో కొత్త 2015 స్విఫ్ట్ డిజైర్ మార్కెట్లోకి వస్తుందని తెలియజేశారు. ప్రస్తుత స్విఫ్ట్ డిజైర్‌కు కొత్త స్విఫ్ట్ డిజైర్‌కు డిజైన్ పరంగా పలు మార్పులు ఉండనున్నాయి. ప్రధానంగా, ఫ్రంట్ ప్రొఫైల్‌లో చెప్పుకోదగిన మార్పులు ఉండనున్నాయి.

Maruti Suzuki Swift Dzire Facelift

కొత్త ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్‌పై పెద్ద క్రోమ్ బార్, రీడిజైన్డ్ బంపర్స్, రీడిజైన్డ్ ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ చుట్టూ క్రోమ్ గార్నిష్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త వీల్స్‌ డిజైన్ వంటి ఎక్స్టీరియర్ మార్పులు ఉండనున్నాయి. అలాగే, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, పవర్ ఫోల్డబిల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, బ్లూటూత్ ఆధారిత ఆడియో సిస్టమ్, కొత్త సీట్ ఫ్యాబ్రిక్స్ వంటి ఇంటీరియర్ మార్పులు ఉండనున్నాయి.

కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ, స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఆఫర్ చేసినట్లుగానే కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో కూడా రీట్యూన్డ్ ఇంజన్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇంజన్ పెర్ఫార్మెన్స్, మైలేజే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కొత్త 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఈ సెగ్మెంట్లోని హోండా అమేజ్, టాటా జెస్ట్, హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, February 8, 2015, 9:51 [IST]
English summary
After the launch of Swift facelift, now Maruti Suzuki India is gearing up to launch the Swift Dzire facelift soon. The updated 2015 Maruti Swift Dzire launch is expected in coming weeks. Stay tuned to drivespark for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+