జూన్-జులై మధ్యలో రానున్న నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇటీవలే థాయ్‌లాండ్ మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను (అక్కడి మార్కెట్లో ఇది మార్చ్ పేరుతో అమ్ముడవుతోంది) విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మైక్రా భారత మార్కెట్‌కు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇది జూన్ లేదా జులై నెలల్లో దేశయ విపణిలో విడుదల కావచ్చని అంచనా.
నిస్సాన్ ఇండియా తొలిసారిగా జులై 2010లో తమ చిన్న కారు మైక్రాను భారత్‌లో విడుదల చేసింది. రానున్న జులై నాటికి మైక్రా భారత మార్కెట్లో మూడు విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, మైక్రా 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అప్‌గ్రేడెడ్ మైక్రాను నిస్సాన్ దేశీయ విపణిలో విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిస్సాన్ ఇండియా తమ మైక్రా కారును భారత్‌లో ప్రవేశపెట్టనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కారులో డిజైన్ పరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు చోటు చేసుకోలేదు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మైక్రాలో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి రియర్ టెయిల్ ల్యాంప్స్, మరిన్ని కొత్త ఫంక్షన్లను చూపించే మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సిస్టమ్ వంటి ఇంటీరియర్ అప్‌డేట్స్, ఎయిర్ వెంట్స్ స్థలం, డిజైన్‌లో మార్పులు, కొత్త ఆడియో సిస్టమ్ వంటి మార్పులను ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మైక్రాలో గమనించవచ్చు.

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ మైక్రా ఫేస్‌లిఫ్ట్



Click it and Unblock the Notifications








