పండుగ సీజన్‌‌లో రానున్న అప్‌గ్రేడెడ్ 2013 రెనో ఫ్లూయెన్స్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి కారు 'ఫ్లూయెన్స్' సెడాన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రెనో ఇండియా 2010వ సంవత్సరంలో తమ ఫ్లూయెన్స్ సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసింది. అయితే, దీని అధిక ధర కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ నేపథ్యంలో, సరికొత్త ఫ్లూయెన్స్‌ను విడుదల చేయటం ద్వారా ఈ మోడల్‌కు పూర్వ వైభవం కల్పించాలని కంపెనీ యోచిస్తోంది.

వాస్తవానికి రెనో ఇండియా గడచిన సంవత్సరంలోనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫ్లూయెన్స్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్‌తో డిజైన్, ఫీచర్స్ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా 2013 రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌ను కంపెనీ తయారు చేసింది. గడచిన సంవత్సరంలో జరిగిన టర్కీ మోటార్ షోలో రెనో తమ సరికొత్త కారును ప్రదర్శనకు ఉంచింది. కానీ, ఈ కారును భారత్‍‌లో విడుదల చేయటంలో చాలా జాప్యం జరిగింది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, రానున్న పండగ సీజన్ నాటికి ఈ కొత్త 2013 రెనో ఫ్లూయెన్స్ సెడాన్ మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. కొత్త ఫ్లూయెన్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త 2013 రెనో ఫ్లూయెన్స్ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. సన్నటి గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్‌తో ఇది సరికొత్త లుక్‌ను కలిగి ఉంటుంది.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

కొత్త ఫ్లూయెన్స్ వెనుక డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. సగం బూట్ డోరుపై, సగం కారుపై ఉండే స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఎగ్జాస్ట్, పెద్ద బంపర్‌తో ఇది వెనుక వైపు నుంచి కూడా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగిన ఈ ప్రీమియం సెడాన్‌లో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

ఇంజన్ పరంగా కొత్త ఫ్లూయెన్స్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2013, 15:02 [IST]
English summary
French auto major Renault has updated its premium sedan Fluence to boost the sales. The updated 2013 Renault Fluence is Expected to launch in India during the festive season this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+