మారుతి వ్యాగన్ఆర్ వర్సెస్ స్టింగ్‌రే; అసలు మ్యాటర్ ఏంటి?

చిన్న కార్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా, తాజాగా మరొక చిన్న కారు 'స్టింగ్‌రే' (Stingray)ను మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఎత్తుగా, విశాలంగా ఉండే ఈ కారుతో చిన్న కార్ ప్రియులను ఆకట్టుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది.

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ మందకొడిగా సాగుతన్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు వెనుకంజ వేస్తుంటే, మారుతి సుజుకి మాత్రం కొత్త ఉత్పత్తులతో కొత్త వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. సరే ఇదంతా అటుంచి, వ్యాగన్ఆర్, స్టింగ్‌రే కార్ల మధ్య వ్యత్యాసం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

వ్యాగన్ఆర్‌కు ప్రతిరూపమే స్టింగ్‌రేనా?
ఈ ప్రశ్నకు సంబంధించి డ్రైవ్‌స్పార్క్‌కు అనేక ఎంక్వైరీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రెండు చిన్న కార్లకు మధ్య వ్యత్యాసాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి. తొలుతగా, ఈ కొత్త కారును వ్యాగన్ఆర్‌కు కొనసాగింపుగా ప్రవేశపెట్టారు. ప్రధానంగా భారతీయ యువతను దృష్టిలో ఉంచుకొని స్టింగ్‌రేను విడుదల చేశారు. దీన్ని బట్టి స్టయిల్ ఫ్యాక్టర్, ధర ఇవి రెండే స్టింగ్‌రే ప్రత్యకతని తెలుస్తోంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ధర

ధర

వ్యాగన్ఆర్ కన్నా స్టింగ్‌రే ధర సుమారు రూ.50,000 వరకు అధనంగా ఉంది. వ్యాగన్ఆర్ ధరలు రూ.3.58 లక్షల నుంచి రూ.4.45 లక్షల రేంజ్‌లో ఉంటే, స్టింగ్‌రే ధరలు రూ.4.10 లక్షల నుంచి రూ.4.67 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

వ్యాగన్ఆర్, స్టింగ్‌రే మోడళ్లలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌నే ఈ రెండు మోడళ్లలోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67.1 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎక్స్టీరియర్స్

ఎక్స్టీరియర్స్

కొత్త స్టింగ్‌రే హ్యాచ్‌బ్యాక్ స్టయిలిష్ క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్‌తో సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్, ఫాగ్‌ల్యాంప్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను స్టింగ్‌రేలో చూడొచ్చు. ఈ రెండు మోడళ్ల ఎక్స్టీరియర్‌ను పక్క ఫొటోలో పరిశీలించండి.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

స్టింగ్‌రే ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా నలుపు ఇంటీరియర్లను కలిగి ఉండి, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్‌తో లభిస్తుంది. ఇందులో మరొక ప్రధాన ఆకర్షన బ్లూ-బ్లాక్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. వ్యాగన్ఆర్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది డ్యూయెల్ టోన్ (బీజ్ అండ్ బ్లాక్) ఇంటీరియర్లతో లభిస్తుంది.

మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్?

మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్?

వ్యాగన్ఆర్, స్టింగ్‌రే కార్లలో డిజైన్ పరమైన మార్పులు తప్పితే, పెద్దగా చర్చించుకునే అంశాలేవీ లేవు. స్టయిలిష్ వెర్షన్ కోరుకునే వారికి స్టింగ్‌రే, ధర గురించి ఆలోచించే వారికి వ్యాగన్ఆర్ కార్లు చక్కటి ఆప్షన్లని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, కొత్త దుస్తుల్లో వచ్చిన పాత వ్యాగన్ఆర్ కారే ఈ స్టింగ్‌రే అనొచ్చు. మీరేమెంటారు..?

More from DriveSpark

Article Published On: Friday, August 30, 2013, 14:29 [IST]
English summary
The leading car manufacturer in India, has stormed the small car segment. The latest entrant in this section comes in the form of ‘Maruti Stingray'. The company hopes to capture hearts of Indian customers, who are on the lookout for a tall boy, hatchback, design.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+