టూర్ డె ఫ్రాన్స్ సపోర్ట్ ఎఫ్-టైప్‌ని ఆవిష్కరించిన జాగ్వార్
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ 2014 టూర్ డె ఫ్రాన్స్ సైక్లింగ్ స్పోర్ట్‌ను సపోర్ట్ చేసేందుకు తమ ఎఫ్-టైప్‌లో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ వాహనం రెండు సైకిళ్లను రూఫ్‌పై క్యారీ చేయగలదు.
ఇది కూడా చదవండి: అర కోటికే మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ కారు
టూర్ డె ఫ్రాన్స్ సైక్లింగ్ రేస్‌లోని స్టేజ్ 20 సమయంలో ఈ కారు టీమ్ స్కై జట్టు రైడర్లను సపోర్ట్ చేయనుంది. జాగ్వార్ బెస్పోక్ డివిజన్ (స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్) ఈ కాన్సెప్ట్ కారును తయారు చేసింది. జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్ కూపె కాన్సెప్ట్‌ని ఆధారంగా చేసుకొని దీనిని తయారు చేశారు. టీమ్ స్కై కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లెడ్‌లలో మరిన్ని వివరాలను తెలుసుకోండి.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్ కూపె కారులో ఉపయోగించిన 5.0 లీటర్, 550 పిఎస్, వి8 సూపర్‌చార్జ్డ్ ఇంజన్‌నే ఈ కాన్సెప్ట్ కారులోను ఉపయోగించారు. ఎక్స్టీరియర్‌పై టీమ్ బ్లూ స్కై థీమ్ ఉంటుంది.

కేవలం ఒక్క యూనిట్‌ను మాత్రమే ఇలా తయారు చేశారు. కారు వెనుక భాగంలో అద్దానికి బదులుగా కార్బన్ ఫైబర్ ర్యాక్‌ను అమర్చారు. దీనిపై రెండు సైకిళ్లను కదలకుండా అమర్చుకోవచ్చు.

ఎక్స్టీరియర్‌తో మ్యాచ్ అయ్యేలా దీని ఇంటీరియర్స్‌ని కూడా బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్‌లో డిజైన్ చేశారు. ఇది కూడా టీమ్ స్కై థీమ్ ఆధారంగానే డిజైన్ చేశారు.

జాగ్వార్ 2010 నుంచి హై-పెర్ఫార్మెన్స్ బ్యూటీలతో టీమ్ స్కై జట్టును సపోర్ట్ చేస్తూ వస్తోంది. గడచిన 2012, 2013 సంవత్సరాలలో జాగ్వార్ ఎక్స్ఎఫ్ స్పోర్ట్‌బ్రేక్స్‌లను సరఫరా చేసింది.

కాగా.. ఈ ఏడాది జాగ్వార్ ఎక్స్ఎఫ్ స్పోర్ట్‌బ్రేక్స్‌కు బదులుగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన జాగ్వార్ ఎఫ్-టైప్ ఆధారంగా తయారు చేసిన ఈ కాన్సెప్ట్ కారును టీమ్ స్కైకి సప్లయ్ చేసింది.


Click it and Unblock the Notifications








