మీలో కూడా ఓ క్రియేటివ్ ఆర్టిస్ట్ దాగున్నాడా?

మీలో కూడా ఓ క్రియేటివ్ ఆర్టిస్ట్ దాగున్నాడా? మీకు డిసి డిజైన్స్ కార్లంటే ఇష్టమా? మీ సమాధానం అవును అయితే, మీకోసమే ఈ చక్కటి అవకాశం. మీరే తర్వాతి దిలీప్ ఛాబ్రియా కావచ్చు.

ఆటోమోటివ్ డిజైన్, వెహికల్ కస్టమైజేషన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దిలీప్ ఛాబ్రియా స్థాపించిన డిసి డిజైన్స్ ఇప్పుడు మీకో చక్కని అవకాశాన్ని అందిస్తోంది. 'బి ది నెక్స్ట్ డిసి' (Be The Next DC) అనే పేరుతో డిసి డిజైన్స్ ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనదలచిన వారు ఓ అద్భుతమైన నెక్స్ట్ జనరేషన్ అవంతి కారును డిజైన్ చేసి, డిసి డిజైన్స్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో బెస్ట్ ఎంట్రీ పంపిన వారికి లక్ వరిస్తుంది. ఈ కాంటెస్ట్‌కు చెందిన మరిన్ని వివరాల కోసం డిసి డిజైన్స్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీని కానీ లేదా అధీకృత వెబ్‌సైట్‌ను కానీ సంప్రదించండి.

ఈలోపుగా, డిసి డిజైన్స్ ఇప్పటి వరకూ కస్టమైజ్ చేసిన/డిజైన్ చేసిన కొన్ని అద్భుతమైన కాన్సెప్ట్ కారును క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

డిసి డిజైన్స్ కాంటెస్ట్

డిసి డిజైన్స్ కాంటెస్ట్

'బి ది నెక్స్ట్ డిసి' (Be The Next DC) అనే పేరుతో డిసి డిజైన్స్ ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనదలచిన వారు ఓ అద్భుతమైన నెక్స్ట్ జనరేషన్ అవంతి కారును డిజైన్ చేసి, డిసి డిజైన్స్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో బెస్ట్ ఎంట్రీ పంపిన వారికి లక్ వరిస్తుంది.

డిసి అవంతి

డిసి అవంతి

డిసి డిజైన్స్ తొలిసారిగా మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేసింది. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా దిలీప్ ఛాబ్రియా డిసి అవంతి కారును ఆవిష్కరించారు.

డిసి అంబాసిడర్

డిసి అంబాసిడర్

దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారును డిసి డిజైన్స్ తమదైన శైలిలో కస్టమైజ్ చేసింది. ప్రీమియం ఎక్స్టీరియర్ లుక్, లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లతో ఈ కారును కస్టమైజ్ చేశారు.

డిసి డస్టర్

డిసి డస్టర్

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రూపు రేఖలను మార్చేసి, డిసి డిజైన్స్ తమ డిఎన్‌ఏ మరింత స్పోర్టీయర్‌గా మార్చేసింది.

డిసి ఫార్చ్యూనర్

డిసి ఫార్చ్యూనర్

ఈ ఫొటోలో కనిపిస్తున్నది పాపులర్ టొయోటా ఫార్చ్యూనర్. జపనీస్ కార్ కంపెనీ అందిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ ప్రీమియం ఎస్‌యూవీని డిసి డిజైన్స్ తమదైన శైలిలో కస్టమైజ్ చేసింది.

డిసి ఎలాంట్రా

డిసి ఎలాంట్రా

డిసి డిజైన్స్ ఇటీవల కస్టమైజ్ చేసిన వాహనాలలో డిసి ఎలాంట్రా కూడా ఒకటి. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రాను బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌తో డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసింది.

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి లాంబోర్గినీ అవెంటేడర్

డిసి డిజైన్స్ కేవలం సాధారణ కార్లను మాత్రమే కాకుండా సూపర్ కార్లను కూడా కస్టమైజ్ చేస్తుంది. అలా కస్టమైజ్ చేసిన సూపర్ కారే ఈ డిసి లాంబోర్గినీ అవెంటేడర్ ప్రిస్మ్ గోల్డ్. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్ షోలో ఇది అవార్డును కూడా గెలుచుకుంది.

డిసి సన్నీ

డిసి సన్నీ

ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు ఇంటీరియర్లను చూసి ఇదేదో లగ్జరీ కారు అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది జపనీస్ కార్ కంపెనీ అందిస్తున్న నిస్సాన్ సన్నీ సెడాన్. దీనికి తన డిఎన్ఏ జోడించి డిసి డిజైన్స్ ఇలా కస్టమైజ్ చేసింది.

డిసి మహీంద్రా థార్

డిసి మహీంద్రా థార్

ఇదేదో ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కారులా ఉంది కదూ... కానీ ఇది మన మహీంద్రా అందిస్తున్న థార్ ఎస్‌యూవీ. డిసి డిజైన్స్ దానిని ఇలా మార్చేసింది.

డిసి రేవా

డిసి రేవా

చూడగానే ఆహా అనిపించే ఈ బుజ్జికారు రేవా అందిస్తున్న ఎలక్ట్రిక్ కారు (రేవా ఐ). డిసి డిజైన్స్ ఈ ఎలక్ట్రిక్ కారుకు టాప్ లేపేసి ఇలా ఓపెన్ టాప్ కారుగా మార్చేసింది.

డిసి అంబాసిడర్ విఐపి

డిసి అంబాసిడర్ విఐపి

మన దేశంలో ఎప్పటి నుంచో విఐపిల కోసం హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కార్లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఇందులో కాస్తంత స్టయిలిష్, లేటెస్ట్ విఐపి వాహనం కోరుకునే వారికోసం డిసి డైజైన్స్ ఈ వాహనాన్ని కస్టమైజ్ చేసింది.

డిసి పోలో

డిసి పోలో

ఈ కారు జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్. దీనికి డిసి డిజైన్స్ తమ స్టయిలింగ్ ఫీచర్లను జోడించి ఇలా కస్టమైజ్ చేసింది.

డిసి పోర్ష్ కయీన్

డిసి పోర్ష్ కయీన్

లగ్జరీ కార్ కంపెనీ పోర్ష్ అందిస్తున్న కయీన్ టర్బో కూపే కారును షేపులు మార్చేసి డిసి డిజైన్స్ ఇలా కస్టమైజ్ చేసింది.

డిసి రేంజ్ రోవర్

డిసి రేంజ్ రోవర్

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ అందిస్తున్న రేంజ్ రోవర్ లగ్జీరీ ఎస్‌యూవీని మరింత లగ్జరీగా, అందులో ఇంటీరియర్లను లాంజ్‌లా కస్టమైజ్ చేసింది డిసి డిజైన్స్.

డిసి మాసేరటి

డిసి మాసేరటి

డిసి స్టయిల్‌లో కస్టమైజ్ చేసిన ఇటాలియన్ లగ్జరీ కారు మాసేరటి.

డిసి మెర్సిడెస్ ఎస్ఎల్ఆర్ రెప్లికా

డిసి మెర్సిడెస్ ఎస్ఎల్ఆర్ రెప్లికా

డిసి డిజైన్ కేవలం కార్లను కస్టమైజ్ చేయటే కాకుండా, కార్లను పోలిన కార్లను కూడా తయారు చేసింది. అలా సృష్టించిన కారే ఈ డిసి మెర్సిడెస్ ఎస్ఎల్ఆర్ రెప్లికా.

డిసి ఇంపిరేటర్

డిసి ఇంపిరేటర్

డిసి డిజైన్స్ స్వతహాగా డిజైన్ చేసిన వాహనాలలో డిసి ఇంపిరేటా స్పోర్ట్స్ కారు కూడా ఒకటి.

డిసి లండన్ టాక్సీ

డిసి లండన్ టాక్సీ

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన పురాతన లండన్ టాక్సీ

డిసి యింగ్ యాంగ్

డిసి యింగ్ యాంగ్

డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన చైనీస్ మినీ బస్ యింగ్ యాంగ్.

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2013, 9:47 [IST]
English summary
Is there a creative artist hiding somewhere in you, and do you love DC designed cars? If yes, here is your opportunity to become the next Dilip Chhabria.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+