ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 3 కొత్త డాట్సన్ కార్లు విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇటీవలే పునఃప్రవేశపెట్టిన చవక కార్ బ్రాండ్ డాట్సన్, భారత మార్కెట్లోని ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్, గో ప్లస్ ఎమ్‌పివి, ఓ స్మాల్ కార్ కాన్సెప్ట్‌ను విడుదల చేయటం ద్వారా ఈ విభాగంలోని దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియాకు సవాల్ విసరనుంది.

గో హ్యాచ్‌బ్యాక్:
మారుతి సుజుకి ఆల్టో కె10, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లకు పోటీగా డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి రానుంది. రూ.4 లక్షలకు దిగువన ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లోని విశాలమైన క్యాబిన్ స్పేస్ ఈ సెగ్మెంట్లోని కార్లలో కెల్లా ఇది విశిష్టంగా ఉండేలా చేస్తుంది. కాకపోతే, డాట్సన్ బ్రాండ్ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ విస్తృతంగా లేకపోవటమే పెద్ద డిస్అడ్వాంటేజ్. ఫిబ్రవరి 2014లో ఇది భారత మార్కెట్లో విడుదల కానుంది.


గో ప్లస్ ఎమ్‌పివి:
గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఎమ్‌పివి 'గో ప్లస్'. గో హ్యాచ్‌బ్యాక్‌ను వెనుక వైపు పొడగించి, మూడవ వరుసలో సీట్లు ఉండేలా డిజైన్ చేశారు. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, షెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. ఎర్టిగా బేస్ వేరియంట్ ధర రూ.6 లక్షలకు పైగా ఉంది. కాగా.. డాట్సన్ గో ప్లస్ ధర దాని కన్నా ఒక లక్ష తక్కువగా ఉండొచ్చని అంచనా. గో హ్యాచ్‌బ్యాక్ విడుదలైన రెండు మూడు నెలల తర్వాత గో ప్లస్ ఎమ్‌పివి విడుదల కానుంది.

ఐ2:
ఇక ఈ ఏడాదిలో డాట్సన్ నుంచి రానున్న చివరి ఉత్పత్తి ఐ2 స్మాల్ కార్. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. డాట్సన్ విడుదల చేయనున్న గో హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన ఈ ఐ2 చిన్న కారును ప్రవేశపెట్టనున్నారు. ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఆల్టో 800 వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలుస్తుంది. దీని ధర రూ.2-3 లక్షల రేంజ్‌లో ఉంటుంది. వచ్చే నెలలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఈ ఐ2 కాన్సెప్ట్ కారును ఆవిష్కరించనున్నారు.
Alto 800

More from DriveSpark

Article Published On: Monday, January 13, 2014, 10:55 [IST]
English summary
Datsun, the brand revived by Nissan to enter the ever green entry level car market in India has an aggressive strategy going ahead. This year we'll get to witness Datsun take the bull (Maruti Suzuki) by its horns as it launches its first model, the GO hatchback, followed by the GO+ MPV and a third concept.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+