డాట్సన్ కాన్సెప్ట్ కార్ స్కెచ్; ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణ

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తిరిగి తీసుకువచ్చిన తమ పురాతన కార్ బ్రాండ్ డాట్సన్ క్రింద కంపెనీ బడ్జెట్ కార్లను విక్రయించనున్న సంగతి తెలిసినదే. ఈ దిశలో భాగంగా, కంపెనీ ఇప్పటికే డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలను ఆవిష్కరించిన కంపెనీ వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మరో కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించడం జరిగింది.

తాజాగా, ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ, డాట్సన్ తమ కాన్సెప్ట్ కారు అఫీషియల్ స్కెచ్‌ను విడుదల చేసింది (క్రింది ఫొటోలో చూడొచ్చు). ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో ఈ కారును పూర్తిగా ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

Datsun Concept Car

డాట్సన్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా, అధిక వృద్ధి ఉన్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, ప్రత్యేకించి యువ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా ఈ కాన్సెప్ట్ కారును తయారు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, డాట్సన్ త్వరలో విడుదల చేయనున్న గో హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన ఈ ఐ2 చిన్న కారును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో ఇది నేరుగా మారుతి సుజుకి ఆల్టో 800 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. దీని ధర రూ.2-3 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2014, 13:39 [IST]
English summary
The Japanese carmaker Datsun has revealed sketches of its next concept car, which will be featured to the Entire world from the Delhi Auto Expo 2014, India. The concept car is a direction of the future expansion of Datsun forthcoming models for India as well as the world.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+