డాట్సన్ గో యాక్ససరీస్ ప్రైస్ లిస్ట్
నిస్సాన్‌కు చెందిన బడ్జెట్ కార్ బ్రాండ్ 'డాట్సన్' భారత్‌లో తమ తొలి హ్యాచ్‌బ్యాక్ 'గో'ను ఈనెల 19న విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. కేవలం రూ.4 లక్షల కన్నా తక్కువ ధరకే అన్ని ఫీచర్లు కలిగిన టాప్-ఎండ్ వేరియంట్‌ను అందిస్తామని కంపెనీ ప్రామిస్ చేసింది. కంపెనీ చెప్పినట్లుగానే అత్యంత సరసమైన ధరకే ఈ చిన్న కారును అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: డాట్సన్ గో సెడాన్ స్కెచ్ విడుదల
కానీ బేసిక్ వేరియంట్ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉండవు కాబట్టి వాటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులు తమ కారును మరింత అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకునేందుకు కూడా కొన్ని రకాల యాక్ససరీసలను కంపెనీ ఆఫర్ చేయనుంది.

ఈ నేపథ్యంలో, డాట్సన్ నుంచి గో హ్యాచ్‌బ్యాక్ కోసం అందుబాటులో ఉన్న యాక్ససరీలు మరియు వాటి ధరల వివరాలను కంపెనీ వెల్లడించింది. ఆ వివరాలను ఈ కథనంలో పరిశీలించండి.
ఇది కూడా చదవండి: డాట్సన్ రెడిగో కాన్సెప్ట్ ఫొటోలు, వివరాలు
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ యాక్ససరీలు, వాటి ధరలు:
* స్టీరింగ్ వీల్ కవర్ - రూ.484
* బంపర్ కార్నర్ ప్రొటెక్షన్ - రూ.545
* డోర్ హ్యాండిల్ క్రోమ్ - రూ.590
* ఎగ్జాస్ట్ టిప్ - రూ.840
* బాడీ సైడ్ మౌల్టింగ్స్ - రూ.1045
* కుషన్ కిట్ - రూ.1100
* బాడీ కవర్ - రూ.1190
* పార్సిల్ ట్రే - రూ.2490
* పెయింట్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ - రూ.2550
* బాడీ గ్రాఫిక్స్ - రూ.2640
* రివర్స్ పార్కింగ్ సెన్సార్ - రూ.2890
* ఫ్యాబ్రిక్ సీట్ కవర్ - రూ.2990
* రూఫ్ రెయిల్ - రూ.2970
* రూఫ్ స్పాయిలర్ - రూ.2998
* రిమోట్ లాకింగ్ - రూ.2998
* ఫాగ్ ల్యాంప్స్ - రూ.465
* లెథర్ సీట్ కవర్ - రూ.4800
* రివర్స్ పార్కింగ్ కెమెరా - రూ.7920
* ఆడియో సిస్టమ్ (రేడియో, సిడి, యూఎస్‌బి, ఆక్స్ఇన్ పోర్ట్) - రూ.7986
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/eVNSKIebqT8?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








