డాట్సన్ గో బుకింగ్స్ ప్రారంభం; మార్చ్‌లో డెలివరీలు

By Ravi

నిస్సాన్‌కు చెందిన లో-కాస్ట్ కార్ బ్రాండ్ డాట్సన్, భారత్‌లో తమ మొట్టమొదటి చిన్న కారు 'డాట్సన్ గో' కోసం అధికారికంగా బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్లు రూ.11,000 బయానా (అడ్వాన్స్) మొత్తంతో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కోసం ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. ఈ చిన్న కారు డెలివరీలు మార్చ్ 2014 నుంచి ప్రారంభం కానున్నాయి.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4 లక్షలకు దిగువనే ఉండనుంది. చెన్నైలోని ఒరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలోనే ఈ చిన్న కారును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంటులో ఫిబ్రవరి 5, 2014వ తేదీ నుంచి డాట్సన్ గో ఉత్పత్తి ప్రారంభమైంది.


నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేశారు. మైక్రాలో ఉపయోగించిన అనేక స్పేర్ పార్ట్స్‌ను డాట్సన్ గో కారులో కూడా ఉపయోగించనున్నారు. ప్రధానంగా మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కారులో కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతానికి డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది. ఈ పెట్రోల్ ఇంజన్ కూడా కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లు ఉండి, ముందు సీట్లలో మరింత ఎక్కువ స్పేస్ లభిస్తుంది.

Datsun Go Hatchback Mumbai

ఇది మొబైల్ డాకింగ్ స్టేషన్‌లో లభ్యమవుతుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌‌ఫోన్లతో కారుకు కనెక్ట్ కావచ్చు. కాగా.. ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో డాట్సన్ గో కోసం కంపెనీ యాక్ససరీ ప్యాకేజ్‌ను విడుదల చేసింది. ఈ కారుకు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 15, 2014, 10:26 [IST]
English summary
After starting the production of Go Hatchback earlier this month on the 4th of February from Renault-Nissan Alliance’s Chennai plant, now Datsun India has commenced taking bookings for this small car across India for a sum of Rs 11,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+