స్విఫ్ట్ డిజైర్, అమేజ్‌లకు పోటీగా డాట్సన్ గో సెడాన్
ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో సునామీ సృష్టించేందుకు తమ పురాతన బ్రాండ్ 'డాట్సన్'కు తిరిగి జీవం పోసిన జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్, ఇప్పుడు డాట్సన్ బ్రాండ్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తుంది. డాట్సన్ గో పేరిట ఈ బ్రాండ్ క్రింద తొలి చిన్న కారును ఆవిష్కరించిన రానున్న రోజుల్లో ఇదే ప్లాట్‌ఫామ్‌పై మరిన్ని ఉత్పత్తులను విడుదల చేసే ఆస్కారం ఉంది.
డాట్సన్ గో ప్లాట్‌ఫామ్‌పై విడుదల కానున్న తర్వాతి ఉత్పత్తి ఓ కాంపాక్ట్ సెడాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లోని మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్లకు ధీటుగా డాట్సన్ గో సెడాన్ ఉండనుంది. ఈ నేపథ్యంలో, డాట్సన్ గో సెడాన్‌కు సంబంధించిన రెండర్ ఫొటోలను ఓ ఆస్ట్రేలియన్ సైట్ విడుదల చేసింది. ప్రొడక్షన్ వెర్షన్ డాట్సన్ గో సెడాన్ ఇంచుమించు ఇలాగే ఉండొచ్చని అంచనా.
స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మరియు బ్రయో హ్యాచ్‌బ్యాక్, బ్రయో అమేజ్ సెడాన్‌ల మాదిరిగానే డాట్సన్ గో, డాట్సన్ గో సెడాన్‌లు ఉండనున్నాయి. డాట్సన్ గో సెడాన్ కూడా పొడవులో 4 మీటర్ల కన్నా కాస్తంత తక్కువగా ఉంటుంది. ఫలితంగా, డాట్సన్ చిన్న కార్లపై భారత ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొంది, సరసమైన ధరకే ఈ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డాట్సన్ గో సెడాన్ ప్రకటన
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసే సమయంలో కంపెనీ అధికారులు గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ సెడాన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించింది.

సెగ్మెంట్ కాంపిటీటర్స్
డాట్సన్ గో సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా నిలువనుంది.

సబ్ ఫోర్ మీటర్ కారు
డాట్సన్ గో సెడాన్ పొడవులో 4 మీటర్ల కన్నా కాస్తంత తక్కువగా ఉండి, చిన్న కార్లపై భారత ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందటం ద్వారా సరసమైన ధరకే ఈ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

మరొక చిన్నకారు, ఎమ్‌పివి
డాట్సన్ గో తర్వాత మరొక చవక కారు (ఐ2 కోడ్‌నేమ్)ను మరియు ఓ ఎమ్‌పివిని కూడా డాట్సన్ విడుదల చేయనుంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, ఇది ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదల కానుంది.
Image Source: Theophilus Chin


Click it and Unblock the Notifications








