డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై ఎమ్‌పివి
ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో తాజాగా ఎంట్రీ ఇచ్చిన జపనీస్ కార్ కంపెనీకు చెందిన డాట్సన్ తమ తొలి కారు గో హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. 'డాట్సన్' ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డాట్సన్ గో పేరిట ఈ బ్రాండ్ క్రింద తొలి చిన్న కారును ఆవిష్కరించిన రానున్న రోజుల్లో ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మరిన్ని ఉత్పత్తులను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని రెండర్ చేసిన సెడాన్ ఫొటోలను మనం ఇది వరకటి కథనంలో తెలుసుకున్నాం.
కాగా.. ఇప్పుడు తాజాగా డాట్సన్ గో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ బహుళ ప్రయోజన వాహనానికి సంబంధించిన రెండరింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న యుటిలిటీ వాహన సెగ్మెంట్లో డాట్సన్ గో ఎమ్‌పివి ఎంట్రీ ఇస్తే ఇది ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమని తెలుస్తోంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డాట్సన్ గో ఎమ్‌పివి
డాట్సన్ గో తర్వాత మరొక చవక కారు (ఐ2 కోడ్‌నేమ్)ను మరియు ఓ ఎమ్‌పివిని కూడా డాట్సన్ విడుదల చేయనుంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ ఓ ఎమ్‌పివిని రూపొందిస్తే, అది ఇలా ఉండొచ్చని రెండరింగ్ చేసిన ఫొటోను ఇక్కడ చూడొచ్చు.

డాట్సన్ గో సెడాన్
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసే సమయంలో కంపెనీ అధికారులు గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ సెడాన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించింది.

సెడాన్ కాంపిటీటర్స్
డాట్సన్ గో సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా నిలువనుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, ఇది ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కాని భారత మార్కెట్లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








