డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ అఫీషియల్ లాంచ్ డేట్ ఎప్పుండటే..

By Ravi

చిన్న కార్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విడుదల తేది ఎట్టకేలకు ఖరారైంది. ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో సునామీ సృష్టించేందుకు వస్తున్న ఈ చిన్న కారును మార్చ్ 19, 2014వ తేదీన భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేస్తామని డాట్సన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

నిస్సాన్ బ్రాండ్ అయిన డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా జులై 2013లో న్యూఢిల్లీని వేదికగా చేసుకొని ప్రపంచానికి పరిచయం చేసింది. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేశారు. ఇది 3785 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉండి 2450 మి.మీ. వీల్‌బేస్‍‌ను కలిగి ఉంటుంది.

ఈ మెజర్‌మెంట్స్‌ను బట్టి చూస్తుంటే, డాట్సన్ గో బ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా మంచి క్యాబిన్ స్పేస్‌ను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ కారులో గేర్ బాక్సును డ్యాష్‌‌బోర్డుకే అమర్చడం వలన ముందు వరుసలో మరింత ఎక్కువ స్థలం లభించనుంది. డాట్సన్ గో బూట్ స్పేస్ సామర్థ్యం 265 లీటర్లు.

Datsun Go Launch Date Officially Confirmed

నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కారులో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది.

డాట్సన్ గో హ్యచ్‌బ్యాక్ కేవలం రూ.3 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే మార్కెట్లో లభ్యం కానుంది. డాట్సన్ గో మొత్తం మూడు వేరియంట్లలో (ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్, టాప్-ఎండ్) లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా రూ.3 లక్షలు, రూ.3.5 లక్షలు మరియు రూ.3.8 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధరలు)గా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2014, 16:03 [IST]
English summary
Datsun has officially confirmed the launch date of Go hatchback as March 19. Datsun first took the veils off of the Go in July 2013 and has since then displayed it across the country and at the Auto Expo giving people enough time to familiarize themselves with the brand name.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+