డాట్సన్ గో విడుదల: ధర, వేరియంట్లు, ఫీచర్ల వివరాలు
నిస్సాన్‌కు చెందిన పురాతన కార్ బ్రాండ్ డాట్సన్ భారత్‌లో తమ తొలి కారు 'గో' హ్యాచ్‌బ్యాక్‌ను నేడు (మార్చ్ 19, 2014) మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. డాట్సన్ గో (Datsun GO) మొత్తం 3 వేరియంట్లలో లభ్యం కానుంది. దీని ప్రారంభ ధర కేవలం రూ.3.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే.
మారుతి ఆల్టో కె10, హ్యుందాయ్ ఇయాన్ వంటి చిన్న కార్లకు గట్టి పోటీనిచ్చేలా డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారును తయారు చేశారు. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేశారు.
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లు, వాటి ధరలు, వేరియంట్ల వారీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తదితర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మూడు వేరియంట్లు
ప్రస్తుత డాట్సన్ బ్రాండ్ సరిగ్గా 100 ఏళ్ల క్రితం తమ తొలికారు DAT (అదే క్రమంగా డాట్సన్‌గా మారింది)ను విడుదల చేసింది. ఆ కారును నివాళిగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ మూడు వేరియంట్లలో (D, A, T) ఆఫర్ చేస్తోంది.

బేస్ వేరియంట్ (D)
బేస్ వేరియంట్లో మైలేజ్, సగటు మైలేజ్, శూన్యం నుంచి దూరం వంటి అంశాలను చూపించే డిజిటల్ టాకోమీటర్, ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్, స్పీడ్ సెన్సిటివ్ వైపర్స్, సిల్వర్ ఫినిష్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. (ఎడమవైపు మిర్రర్, బాటిల్ హోల్డర్స్ మరియు డోర్ లోపలి వైపు మ్యాప్ పాకెట్స్ ఆప్షనల్ ఫీచర్లు (డి1 ట్రిమ్)).

మిడ్ వేరియంట్ (A)
బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అధనంగా మిడ్ వేరియంట్లో ఫిల్టర్‌తో కూడిన ఎయిర్ కండిషనర్, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బాడీ కలర్డ్ బంపర్స్, జాక్వార్డ్ సీట్స్ లభ్యం కానున్నాయి.

టాప్ వేరియంట్ (T)
మిడ్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అధనంగా టాప్ వేరియంట్లో స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మొబైల్ డాకింగ్ స్టేషన్ (ఎమ్‌డిఎస్) విత్ యాంప్లిఫయర్, యూనివర్సల్ మొబైల్ హోల్డర్, ఆక్స్-ఇన్ అండ్ యూఎస్‌బి చార్జర్, ఫ్రంట్ స్పీకర్స్, సెంట్రల్ లాకింగ్ మరియు ఫుల్ వీల్ కవర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇంజన్
నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది.

మైలేజ్, వారంటీ
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 20.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో కెల్లా మొదటిసారిగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం రోడ్-సైడ్ అసిస్టెన్స్‌ను మరియు 2 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తోంది.

బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్ స్పేస్
డాట్సన్ గో 3785 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉండి మంచి క్యాబిన్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కారులో గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే అమర్చడం వలన ముందు వరుసలో మరింత ఎక్కువ స్థలం లభించనుంది. డాట్సన్ గో బూట్ స్పేస్ సామర్థ్యం 265 లీటర్లు. ఇది 2450 మి.మీ. వీల్‌బేస్‍ను కలిగి ఉంటుంది.

కలర్ ఆప్షన్స్
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మొత్తం నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. అవి - వైట్, సిల్వర్, స్కై బ్లూ, రూబీ రెడ్.

వేరియంట్లు, ధరలు
బేస్ వేరియంట్ డి - రూ.3.12 లక్షలు
బేస్ వేరియంట్ ఏ - రూ.3.46 లక్షలు
బేస్ వేరియంట్ టి - రూ.3.69 లక్షలు


Click it and Unblock the Notifications








