క్రాష్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన డాట్సన్ గో, మారుతి స్విఫ్ట్!
మేడ్ ఇన్ ఇండియా ఎంట్రీ లెవల్ కార్స్ ప్రయాణీకులకు సురక్షితం కావని మరోసారి స్పష్టమైంది. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తమ బడ్జెట్ కార్ బ్రాండ్ క్రింద ప్రవేశపెట్టిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మరియు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ ఎన్‌సిఏపి) క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమయ్యాయి.
ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!
ఈ క్రాష్ టెస్టులో కారు సర్టిఫై అవ్వాలంటే, సదరు కారులో కనీసం ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ ఫీచర్లయినా ఉండాలి. మన మార్కెట్లో అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎయిర్‌బ్యాగ్స్ లేదా ఏబిఎస్ రెండూ కూడా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభ్యం కావు. టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే ఇవి ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటాయి. తాజాగా టెస్ట్ ఎన్‌సిఏపి చేసిన స్విఫ్ట్ కారులో కూడా ఈ రెండు సేఫ్టీ ఫీచర్లు లేవు.

ఫలితంగా మారుతి స్విఫ్ట్ ఈ క్రాష్ట్ టెస్ట్‌లో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇలాంటి కారులో ప్రయాణించడం ప్రయాణీకులకు ఏమాత్రం సురక్షితం కాదని ఎన్‌సిఏపి సర్టిఫై చేసింది. అయితే, లాటిన్ అమెరికాకు ఎగుమతి అవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో మాత్రం ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో లాటిన్ అమెరికా వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఐదు స్టార్లకు మొత్తం మూడ స్టార్ల రేటింగ్‌ను దక్కించుకుంది.
అంటే, ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్ కన్నా లాటిన్ అమెరికా వెర్షన్ స్విఫ్ట్ సేఫ్టీ పరంగా ఎన్నో రెట్లు మెరుగైనదన్నమాట. ఈ క్రాష్ టెస్టులో డ్రైవర్ స్థానంలో ఉంచి డమ్మీపై తీవ్రమైన గాయాలు నమోదయ్యాయి. స్విఫ్ట్ కారు ముందు భాగం కూడా బాగా డ్యామేజ్ అయ్యింది.

ఇక డాట్సన్ గో క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే.. ఇది స్విఫ్ట్ కన్నా అసురక్షితమైన కారు అని తేలింది. ఈ కారులో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ ఫీచర్లు లేవు. క్రాష్ టెస్టులో డాట్సన్ గో ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. ఇందులో ఉంచి డమ్మీల తలకు, కాలికి తీవ్రమైన గాయాలు నమోదయ్యాయి. ఫలితంగా ఇది గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో జీరో రేటింగ్‌ను దక్కించుకుంది.


Click it and Unblock the Notifications








