ఇండోనేషియాలో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విడుదల
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మన కన్నా ముందుగా ఇండోనేషియన్ కస్టమర్లకు చేరువ అయ్యింది. నిస్సాన్‌కు చెందిన పురాతన ఆటోమొబైల్ బ్రాండ్ డాట్సన్ తమ గో (GO) హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'గో+ పాన్కా' (GO+ Panca) ఎమ్‌పివిని కంపెనీ ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది. రానున్న నెలల్లో ఇదే ఎమ్‌పిని ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి: డాట్సన్ గో ఆన్-డు సెడాన్
డాట్సన్ గో ప్లస్ పాన్కా ఎమ్‌పివిని ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో ఉన్న పర్‌వకార్తా ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ప్లాంట్‌లో కేవలం డాట్సన్ కార్ల ఉత్పత్తి మరియు ఇంజన్ల అసెంబ్లింగ్ మాత్రమే చేయనున్నారు. ఇండోనేషియాలో డాట్సన్ గో ప్లస్ పాన్కా ఎమ్‌పివి కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 68 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు. జకార్తాలో డాట్సన్ గో ప్లస్ పాన్కా ఎమ్‌పివి ధర 85 మిలియన్ ఐడిఆర్‌లుగా ఉంది. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.4.42 లక్షలు (ఎక్స్-షోరూమ్).
డాట్సన్ గో ప్లస్ పాన్కా ఎమ్‌పివి 5+2 సీటింగ్ కెపాసిటీతో లభ్యం కానుంది. ఇందులో కనెక్టెడ్ ఫ్రంట్ సీట్స్, స్పీడ్ సెన్సింగ్ వైపర్స్, మల్టీ ఫంక్షనల్ డిస్‌ప్లే, ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్, మొబైల్ డాకింగ్ స్టేషన్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇంకా కస్టమర్లు కావాలనుకుంటే, తమ ఇష్టం మేరకు వివిధ రకాల యాక్ససరీలతో తమ ఎమ్‌పివిని కస్టమైజ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








