వావ్.. రూ.3.79 లక్షలకే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు చెందిన చవక కార్ బ్రాండ్ డాట్సన్, భారత మార్కెట్లో తమ రెండవ ఉత్పత్తి 'డాట్సన్ గో ప్లస్' (Datsun Go+) ఎమ్‌పివిని నేడు (జనవరి 15, 2015) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ప్రారంభ ధర కేవలం రూ.3.79 లక్షలు మాత్రమే (బేస్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర).

డాట్సన్ ఇండియా, గతంలో ప్రామిస్ చేసినట్లుగానే రూ.5 లక్షల కన్నా తక్కువ ధరకే భారత్‌లో తమ ఎమ్‌పివిని ఆఫర్ చేస్తోంది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటు లేదు. భారత మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వేరియంట్లు, వాటి ధర వివరాలు ఇలా ఉన్నాయి:


డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ధరలు:
  • డాట్సన్ గో ప్లస్ డి: రూ.3.79 లక్షలు
  • డాట్సన్ గో ప్లస్ డి1: రూ.3.82 లక్షలు
  • డాట్సన్ గో ప్లస్ ఏ: రూ.4.15 లక్షలు
  • డాట్సన్ గో ప్లస్ టి: రూ.4.16 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇది కూడా చదవండి: డాట్సన్ గో ప్లస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌నే ఈ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 14.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుందని కంపెనీ తెలిపింది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 15, 2015, 12:54 [IST]
English summary
Datsun India today announced the launch of its GO+ MPV in India. The Datsun GO Plus MPV is priced at INR 3.79 lakhs (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+