నిస్సాన్‌కు చెందిన పురాతన ఆటోమొబైల్ బ్రాండ్ డాట్సన్ తమ గో (GO) హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన 'గో+' (GO+) (గో ప్లస్ అని పలకాలి) అనే ఎమ్‌పివిని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. గో హ్యాచ్‌బ్యాక్ విడుదల తర్వాత (ఈ ఏడాది మధ్య భాగం నాటికి) ఇది మార్కెట్లోకి రానుంది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. దీనిని ప్రత్యేకించి భారతదేశం కోసం అభివృద్ధి చేశారు. గో హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్, గో ప్లస్ ఎమ్‌పివి వీల్‌బేస్ రెండు ఒకేలా ఉంటాయి (2450 మి.మీ.). ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకొని, సరసమైన ధరకే వీటిని అందించాలనే ఉద్దేశ్యంతో డాట్సన్ తమ ఎమ్‌పివి కోసం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను యధావిధిగా ఉపయోగించుకుంది.
డాట్సన్ గో ప్లస్ ఒక సెవన్ సీటర్ ఎమ్‌పివి, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింద ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.
కొలతలు
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మొత్తం 3995 మి.మీ. పొడవును, 1635 మి.మీ. వెడల్పును, 1485 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.
ఇంజన్
డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ మైక్రా కార్లలో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మొబైల్ డాకింగ్ స్టేషన్
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 'మొబైల్ డాకింగ్ స్టేషన్'తో లభిస్తుంది. ఈ ఫొటో దీని ఇంటీరియర్ లుక్‌ను చూడొచ్చు.
7 సీటర్
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి 7 సీటర్ ఆప్షన్ (2+3+2) (డ్రైవర్‌తో కలిపి)ను కలిగి ఉంటుంది. ముందు వరుస అలాగే మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన లెగ్‌రూమ్ ఉంటుంది.
సెంటర్ కన్సోల్ లేదు
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలో కూడా హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ మాదిరిగానే సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్ బాక్సును డ్యాష్‌బోర్డుకే జతచేయబడి ఉంటుంది.
ఖర్చు తగ్గించుకునే చర్య
డాట్సన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గో హ్యాచ్‌బ్యాక్ కారును పెద్దగా మార్పు చేయకుండా, వెనుక వైపు మాత్రమే కాస్తంత స్థలాన్ని పెంచి ఈ ఎమ్‌పివి రూపొందించింది. అందుకే వెనుక డోరు కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎమ్‌పివి అంత చిన్న డోర్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.
ఫోల్డబల్ రియర్ సీట్స్
డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా ముందుకు మడచి, లగేజ్ రూమ్‌ను పెంచుకోవచ్చు.
థర్డ్ రో సీట్స్
మూడవ వరుసలోని సీట్లు పొట్టిగా ఉండే వారికి లేదా చిన్న పిల్లకు మాత్రమే సరిపోయేలా ఉంటాయి. పొడవుగా ఉన్నవారు కానీ లేదా కొంచెం లావుగా ఉన్న వారు కానీ ఇందులో సౌకర్యంగా కూర్చోలేరు.


Click it and Unblock the Notifications