డాట్సన్ గో ధర, వేరియంట్స్ వివరాలు లీక్; అతి త్వరలో లాంచ్!
నిస్సాన్‌కు చెందిన డాట్సన్ బ్రాండ్ భారతదేశంలో తమ తొలి హ్యాచ్‌బ్యాక్ 'డాట్సన్ గో'ను ఈ నెల మధ్య భాగంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో, డాట్సన్ గో కారుకు సంబంధించిన ధర, వేరియంట్ల వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
డాట్సన్ గో హ్యచ్‌బ్యాక్ కేవలం రూ.3 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే మార్కెట్లో లభ్యం కానుంది. డాట్సన్ గో మొత్తం మూడు వేరియంట్లలో (ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్, టాప్-ఎండ్) లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా రూ.3 లక్షలు, రూ.3.5 లక్షలు మరియు రూ.3.8 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధరలు)గా ఉండనున్నాయి.
డాట్సన్ తమ గో కారును భారత్‌లో ఆవిష్కరించిన సందర్భంగా, తమ కారును రూ.4 లక్షల ధరకు దిగువనే అందిస్తామని హామీ ఇచ్చింది. కంపెనీ చెప్పినట్లుగా అన్ని ఫీచర్లతో లభించే టాప్-ఎండ్ వేరియంట్ కారునే కేవలం రూ.3.8 లక్షలకే ఆఫర్ చేయనుంది.

ప్రస్తుతానికి డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానుంది. ఈ పెట్రోల్ ఇంజన్ కూడా కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లు ఉండి, ముందు సీట్లలో మరింత ఎక్కువ స్పేస్ లభిస్తుంది.
ఇది మొబైల్ డాకింగ్ స్టేషన్‌లో లభ్యమవుతుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్లతో కారుకు కనెక్ట్ కావచ్చు. కాగా.. ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో డాట్సన్ గో కోసం కంపెనీ యాక్ససరీ ప్యాకేజ్‌ను విడుదల చేసింది. ఈ కారుకు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








