భారత్‌లో 'డాట్సన్ గో' హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి ప్రారంభం..
నిస్సాన్‌కు చెందిన లో-కాస్ట్ కార్ బ్రాండ్ డాట్సన్, భారత్‌లో తమ మొట్టమొదటి చిన్న కారు 'డాట్సన్ గో'ను మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ దిశలో భాగంగా, భారత్‌లో తమ గో హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం చెన్నైలోని ఒరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో ఈ చిన్న కారును కూడా ఉత్పత్తి చేస్తున్న డాట్సన్ తెలిపింది.
డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా జులై 2013 నెలలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి దశకు చేరుకుంది. రేపటి (ఫిబ్రవరి 5, 2014) నుంచి ప్రారంభం కానున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో డాట్సన్ ఈ కారును వాణిజ్య పరంగా విడుదల చేసే అవకాశం ఉంది.
నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేశారు. మైక్రాలో ఉపయోగించిన అనేక స్పేర్ పార్ట్స్‌ను డాట్సన్ గో కారులో కూడా ఉపయోగించనున్నారు. ప్రధానంగా మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కారులో కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతానికి డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ వెర్షన్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. ఈ పెట్రోల్ ఇంజన్ కూడా కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లు ఉండి, ముందు సీట్లలో మరింత ఎక్కువ స్పేస్ లభిస్తుంది.
ఇది మొబైల్ డాకింగ్ స్టేషన్‌లో లభ్యమవుతుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్లతో కారుకు కనెక్ట్ కావచ్చు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం డాట్సన్ గో చిన్న కారు ధర రూ.4 లక్షలకు దిగువనే ఉండనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








