వావ్.. డాట్సన్ గో కారులో ఇన్ని డిజైన్‌లు ఉన్నాయా..?

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తమ డాట్సన్ బ్రాండ్ వాహనాలను భారత మార్కెట్లోనే కాకుండా, ఇండోనేషియా వంటి మార్కెట్లలో కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో డాట్సన్ ఇండోనేషియా, తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం ఓ సరికొత్త కాంటెస్ట్‌ని నిర్వహిస్తోంది. 'డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్' పేరిట కంపెనీ ప్రారంభించిన ఈ క్యాంపైన్‌లో ఔత్సాహికులు తమకు నచ్చిన రీతిలో గో హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌ను కస్టమైజ్ చేసి, కంపెనీ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

ఈ డిజైన్లలో బెస్ట్ డిజైన్‌ను ఎంచుకొని, మొదటి నాలుగు బెస్ట్ డిజైన్లకు బహుమతులు అందజేస్తుంది. ఇప్పటికే, ఈ క్యాంపైన్ కోసం భారీ సంఖ్యలో డిజైన్లు వస్తున్నాయి. ఆటోమోటివ్ డిజైనర్లు తమకు నచ్చినట్లుగా ఈ మోడల్‌ను కస్టమైజ్ చేస్తున్నారు. అందులో కొన్ని బెస్ట్ డిజైన్లను ఈ కథనంలో చూద్దాం రండి.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే.. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తయారు చేశారు. నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

ర్యాలీ కార్ మాదిరిగా డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

ఇండోనేషియన్ పోలీస్ కార్ థీమ్‌తో డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

స్పైడర్ మ్యాన్ థీమ్‌తో డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

స్టయిలిష్ బాడీ కిట్‌తో డిజైన్ చేసిన డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

ఎక్స్-మెన్ థీమ్‌తో డిజైన్ చేసిన డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

స్పోర్టీ ర్యాలీ కార్ థీమ్‌తో డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

స్పోర్టీ థీమ్‌తో డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

కలర్‌ఫుల్ ఆర్ట్ థీమ్‌తో డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

మోన్‌స్టర్ థీమ్‌తో డిజైన్ చేసిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

డాట్సన్ గో ఎక్స్‌ప్లోర్ యువర్ స్టైల్

ఆర్ట్ పీస్‌గా మారిన డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్.

More from DriveSpark

Article Published On: Wednesday, January 21, 2015, 17:38 [IST]
English summary
Datsun Indonesia has started a campaign for its GO hatchback. The campaign named as Datsun GO Xplore Your Style - which is a design competition. Take a look at some awesome designs submitted by few designers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+