డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కోసం యాక్ససరీ ప్యాకేజ్‌లు - వివరాలు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్న్ ఇటీవలే తమ బడ్జెట్ కార్ బ్రాండ్ డాట్సన్ క్రింద తొలి కారు 'గో' హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. డాట్సన్ గో బడ్జెట్ కారు కావటంతో ఇది కొన్ని ఫీచర్లతో మాత్రమే లభిస్తుంది.

ఈ నేపథ్యంలో, మరిన్ని ఫీచర్లను కోరుకునే వారి కోసం, డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌కు అదనంగా కంపెనీ కొన్ని యాక్ససరీ ప్యాకేజ్‌లను పరిచయం చేసింది. మనం ఎంచుకునే ప్యాకేజ్‌లను బట్టి ఇందులో ఆఫర్ చేసే యాక్ససరీలు వేర్వేరుగా ఉంటాయి.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మొత్తం మూడు వేరియంట్ల (డి, ఏ, టి)లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.3.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మరి డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం ఆఫర్ చేస్తున్న ఆ యాక్ససరీ ప్యాకేజ్‌ల వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

ఉమెన్ ఎడిషన్

ఉమెన్ ఎడిషన్

ఈ ప్యాకేజ్‌లో భాగంగా.. రివర్స్ పార్కింగ్ సెన్సార్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రిమోట్ లాకింగ్ సెక్యూరిటీ సిస్టమ్, పార్సిల్ ట్రే, రియర్ విండో కర్టెన్, సైడ్ విండో కర్టెన్, కుషన్ కిట్, మూడ్ లైట్ మరియు బాడీ గ్రాఫిక్స్ లభిస్తాయి.

డాట్సన్ గో ఆప్షనల్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ లేదా రివర్స్ కెమెరాతో కూడా లభిస్తుంది.

ఫ్యామిలీ ప్యాకేజ్ 1 (స్టాండర్డ్ + మిడ్ వేరియంట్స్)

ఫ్యామిలీ ప్యాకేజ్ 1 (స్టాండర్డ్ + మిడ్ వేరియంట్స్)

ఈ ప్యాకేజ్‌లో భాగంగా, కార్పెట్ మ్యాట్స్, పివిసి లగేజ్ మ్యాట్, ఆర్ట్ లెథర్ సీట్ కవర్, కుషన్ కిట్, పార్సిల్ ట్రే, సైడ్ కర్టెన్ మరియు రిమోట్ లాకింగ్ సెక్యూరిటీ సిస్టమ్ ఫీచర్లు లభిస్తాయి.

డాట్సన్ గో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన మూడ్ లైటింగ్ ఫీచర్‌తో లభిస్తుంది (ఆప్షనల్ ఫీచర్).

ఫ్యామిలీ ప్యాకేజ్ 2 (హై-ఎండ్ వేరియంట్)

ఫ్యామిలీ ప్యాకేజ్ 2 (హై-ఎండ్ వేరియంట్)

ఈ ప్యాకేజ్‌లో భాగంగా.. ఫాగ్ ల్యాంప్స్, డోర్ విజర్, బాడీ గ్రాఫిక్స్, బాడీ సైడ్ మోల్డింగ్, స్టీరింగ్ వీల్ కవర్, కార్పెట్ మ్యాట్, పివిసి లగేజ్ మ్యాట, ఆర్ట్ లెథర్ సీట్ కవర్, కుషన్ కిట్, పార్సిల్ ట్రే, సైడ్ విండో కర్టెన్ మరియు రిమోట్ లాకింగ్ సెక్యూరిటీ సిస్టమ్‌తో లభిస్తుంది.

కస్టమర్లు ప్రకాశించే డాట్సన్ లోగోను కూడా యాక్ససరీగా ఎంచుకోవచ్చు.

స్పోర్టీ ప్యాకేజ్

స్పోర్టీ ప్యాకేజ్

పేరుకు తగినట్లుగానే ఈ ప్యాకేజ్‌లో.. రియర్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్, ఫాగ్ ల్యాంప్స్, డోర్ విజర్, అల్లాయ్ వీల్, ఎగ్జాస్ట్ పినిషర్, బాడీ సైడ్ మౌల్డింగ్స్, బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడి స్కఫ్ ప్లేట్స్, ఆర్ట్ లెథర్ సీట్ కవర్, స్టీరింగ్ వీల్ కవర్, లెథర్ గేర్ నాబ్ ఫీచర్లు లభిస్తాయి.

ఎల్ఈడి స్కఫ్ ప్లేట్లు ఈ స్పోర్టీ యాక్ససరీ ప్యాకేజ్‌లో భాగం.

ట్రెండీ ప్యాకేజ్

ట్రెండీ ప్యాకేజ్

ఈ ప్యాకేజ్‌లో.. రివర్స్ పార్కింగ్ కెమెరా, యాంటీనా, రియర్ పార్సిల్ ట్రే, ఆడియో సిట్టమ్ (స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో), రెండు స్పీకర్లు (వెనుక), గ్లోయింగ్ లోగో, మూడ్ లైట్ ఫీచర్లు లభిస్తాయి.

సిడి, యూఎస్‌బి, ఆక్స్ఇన్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.

ఎసెన్షియల్ ప్యాకేజ్ 1

ఎసెన్షియల్ ప్యాకేజ్ 1

ఈ ప్యాకేజ్‌లో.. రిమోట్ లాకింగ్ సిస్టమ్, బాడీ కవర్, స్ప్లాష్ గార్డ్, లగేజ్ మ్యాట్, బ్లాక్ పివిసి మ్యాట్స్, ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్, స్టీరింగ్ వీల్ కవర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఎసెన్షియల్ ప్యాకేజ్ 2

ఎసెన్షియల్ ప్యాకేజ్ 2

ఈ ప్యాకేజ్‌లో.. రియర్ పార్సిల్ ట్రే, కార్పెట్ మ్యాట్, రిమోట్ లాకింగ్ సెక్యూరిటీ సిస్టమ్, ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్, స్టీరింగ్ వీల్ కవర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 22, 2014, 14:30 [IST]
English summary
Datsun is offering seven optional accessory packages for its GO hatchback. Take look at all these optional accessory packages details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+