డాట్సన్ సెడాన్ స్కెచ్ విడుదల; రష్యాలో ఆవిష్కరణ

By Ravi

ఇండియాలో 'డాట్సన్ గో' హ్యాచ్‌బ్యాక్‌ను, ఇండోనేషియాలో 'డాట్సన్ గో ప్లస్' ఎమ్‌పివిని ఆవిష్కరించిన జపనీస్ కార్ బ్రాండ్ డాట్సన్ ఇప్పుడు తాజాగా మరో సెడాన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి తమ సెడాన్‌ను ఆవిష్కరించేందుకు కంపెనీ రష్యా రాజధాని మాస్కోను వేదికగా చేసుకొంది.

ఈ నేపథ్యలో, డాట్సన్ సెడాన్‌కు సంబంధించిన ఓ అఫీషియల్ స్కెచ్‌ను కంపెనీ విడుదల చేసింది. ఏప్రిల్ 4, 2014వ తేదీన తమ సెడాన్‌ను మాస్కోలో ఆవిష్కరిస్తామని డాట్సన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేకించి రష్యన్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ సెడాన్‌ను అభివృద్ధి చేశామని డాట్సన్ ప్రకటించింది.

Datsun Sedan

నిస్సాన్ గతంలో నిలిపివేసిన తమ 30 ఏళ్ల పురాతన బ్రాండ్ డాట్సన్‌ను ఇండియా, ఇండోనేషియా, రష్యా వంటి చిన్న కార్ మార్కెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండే ఏషియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని గడచిన సంవత్సరంలో తిరిగి ప్రవేశపెట్టింది. ఇప్పటికే గో హ్యాచ్‌బ్యాక్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి, ఇగో ప్లస్ ఎమ్‌పివి ద్వారా ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశించిన డాట్సన్ ఇప్పుడు తమ సెడాన్ ద్వారా రష్యన్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

డాట్సన్ సెడాన్‌ను జపాన్‌లోనే డిజైన్ చేసినప్పటికీ, నిస్సాన్ ఎంచుకున్న అంతర్జాతీయ ఇంజనీర్ల బృందం దీనిని అభివృద్ధి చేసింది. ఈ ఏడాదిలో రష్యన్ క్టమర్లకు ఈ డాట్సన్ సెడాన్ అందుబాటులోకి రానుంది. ఈ కారుకు సంబంధించి రష్యన్ కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను (www.datsun.ru) కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఏప్రిల్ 4, 2014 వరకు ఆగాల్సిందే.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2014, 18:12 [IST]
English summary
Datsun is on a role with reveals and new products to concepts. They showcased their recent concept and line-up at the 2014 Auto Expo, in Delhi. Now a sketch has been revealed by the car manufacturer of a new Sedan, however, it is bound for Russia currently.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+