డిసి అవంతి స్పోర్ట్స్ కార్ టెక్నికల్ డిటేల్స్ వెల్లడి

వెహికల్ కస్టమైజేషన్ దిగ్గజం, ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన 'డిసి డిజైన్స్' సంస్థ తయారు చేస్తున్న మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారు 'డిసి అవంతి' (DC Avanti)ని అతి త్వరలోనే వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ కారుకు సంబంధించి ఇటీవలే ఓ బ్రోచర్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. అందులో ఈ కారుకు సంబంధించిన వివరాలున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

డిసి డిజైన్స్ తొలిసారిగా తమ అవంతి కారును 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. డిసి డిజైన్స్ తమ అవంతి స్పోర్ట్స్ కారును గుజరాత్‌లోని సనంద్ పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 3500 యూనిట్లు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

తర్వాతి స్లైడ్‌లలో డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్‌ను తెలుసుకోండి.

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

డిసి అవంతి కారు 4550 మి.మీ. పొడవును, 1965 మి.మీ. వెడల్పును, 120 మి.మీ. ఎత్తును మరియు 2700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ.

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

డిసి అవంతి ఓ టూ-సీటర్ స్పోర్ట్స్ కార్. ఇండియన్ రోడ్ కండిషన్స్‌కి అనుగుణంగా తయారు చేసిన ఈ కారులో 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 255/35 టైర్లు, వెనుక వైపు 295/30 టైర్లను ఉపయోగించారు.

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

ఈ కారులో 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 250 హెచ్‌పిల శక్తిని, 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

ఈ ఇంజన్ కారు మధ్య భాగంలో (మిడ్-ఇంజన్) అమర్చబడి ఉంటుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది (రియల్ వీల్ డ్రైవ్).

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

డిసి అవంత బాడీ కార్బన్ కాంపోసైట్ మెటీరియల్‌తో తయారు చేయటం వలన ఇది తేలిక బరువును కలిగి ఉంటుంది. కంపెనీ తమ బ్రోచర్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది 1580 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

ముందు, వెనుక డబువ్ విష్ బోన్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేసింగ్ సిస్టమ్) స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

బై-హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. దాదాపు రూ.35 లక్షల విలువ చేసే ఈ కారులో బహుశా ఎయిర్‌బ్యాగ్స్ లేవని తెలుస్తోంది (బ్రోచర్‌లో వీటి గురించి పేర్కొనలేదు).

డిసి అవంతి టెక్నికల్ డిటేల్స్

డిసి అవంతి 10 రంగులలో లభ్యం కానుంది. మొదటి బ్యాచ్ డిసి అవంతి (500 యూనిట్లు) ఇప్పటికే బుక్ అయిపోయినట్లు సమాచారం. వీటి డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి.

Most Read Articles

English summary
DC Avanti sports car's brochure is revealed in internet. Here are given the DC Avanti car's technical specifications and features. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X